Home » Tag » yscrp
జగన్ పాలనలో అభివృద్ధి కనిపిస్తుందా..? వైఎస్సార్ వదిలేసిన ఒక్క ప్రాజెక్టునూ జగన్ పూర్తి చేయలేదు. కడప స్టీల్ ఫ్యాక్టరీ వైఎస్సార్ కల. జగన్ మాత్రం స్టీల్‌ప్లాంట్ పూర్తి చేయకుండా.. కడప వెళ్లినప్పుడల్లా శంకుస్థాపన చేసి వస్తాడు. ఒకే ప్రాజెక్టుకు పదేపదే శంకుస్థాపన చేస్తాడు.
వైసీపీ మేనిఫెస్టో సంచలనాలకు కేరాఫ్‌గా ఉండబోతుందని ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి ఓటర్లను ఆకర్షించే విధంగా.. ఓ కీలక నిర్ణయాన్ని జగన్ త్వరలో ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.
దాదాపుగా 40 నిమిషాల పాటు.. కేసీఆర్‌తో జగన్ చర్చలు జరిపారు. జగన్ వచ్చింది పరామర్శ కోసం మాత్రమే కాదు. అంతకుమించి అని రాజకీయం తెలిసిన వాళ్లకు ఎవరికైనా అర్థమైపోతుంది ఈజీగా! ఏపీలో రాజకీయ పరిణామాలపై ఇద్దరి మధ్య ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.
రెండు రాష్ట్రాల్లోనూ అత్యధిక జనాభా ఉన్న సామాజికవర్గాలు మాత్రం అధికారానికి దూరంగానే ఉన్నాయి. తెలంగాణలో బీసీలు, ఏపీలో కాపులు అధిక జనాభా కలిగి ఉన్నారు. అయినప్పటికీ అధికారం మాత్రం అందని ద్రాక్షగానే ఉంది. ఇప్పటికీ రాజకీయాల్ని శాసించే స్థాయిలో మాత్రం లేరు.
ఏపీ రాజకీయం థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. అన్నీ జరిగినట్లు కనిపిస్తున్నాయ్ కానీ ఏదీ జరగడం లేదు అన్నట్లుగా ఉంది అక్కడ పరిస్థితి. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. టీడీపీ, వైసీపీ ఢీ అంటే ఢీ అనే రేంజ్లో.. వార్ కంటిన్యూ చేస్తున్నాయ్. టీడీపీ ఇప్పటికే మినీ మేనిఫెస్టో ప్రకటించింది.