Home » Tag » YSRTP
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (Andhra Pradesh Elections) మరోసారి కడప ఎంపీ (Kadapa MP) సీటు కాక రేపబోతోంది. ఎంపీ అవినాష్ రెడ్డి MP Avinash Reddy) వర్సెస్ ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఇక్కడ నుంచి పోటీ చేస్తుండటంతో హాట్ టాపిక్ గా మారింది.
ఆంధ్రప్రదేశ్ లో ఏపీ ఎన్నికలు రానున్న రోజుల్లో రసవంతంగా మారనున్నాయి. ఏపీ రాజకీయ పార్టీలు ఒక ఎత్తు అయితే.. వైఎస్ ఫ్యామిలీ (YS Family) పొలిటికల్ ఫైట్ మరో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో షర్మిల వైఎస్ఆర్ టీపీ పార్టీ పెట్టి.. ఎన్నికల్లో పోటి చేయ్య కుండానే ఆ పార్టీని జాతీయ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంది.
షర్మిల చేరిక ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఈ ముగ్గురు కాంగ్రెస్ హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉన్నారు. ఏపీ ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాకూర్ ఆధ్వర్యంలోనే విలీన కార్యక్రమం జరిగినా.. ఆ ఛాయలకు కూడా వెళ్ళలేదు వీళ్ళు.
ఢీల్లీలో చెల్లి.. గల్లీలో అన్న
పార్టీ ఎందుకు పెట్టావ్ ఎందుకు మూసేశారు..షర్మిల తింగరి రాజకీయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇకపై తన చెల్లెలు షర్మిలను శత్రువుగానే చూడబోతున్నారా ? షర్మిల కాంగ్రెస్ లో చేరారు... రేపో, మాపో ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు కూడా అవుతారని అంటున్నారు. అందుకే షర్మిలను ప్రత్యర్థిగానే చూడాలని వైసీపీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనిపై ఆ పార్టీ లీడర్లకు సందేశాలు కూడా వెళ్ళాయేమో. అందుకేనా మంత్రి పెద్దిరెడ్డి అలా మాట్లాడారు అన్న చర్చ నడుస్తోంది.
వైఎస్ కొడుకు జగన్మోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ అధిష్టానానికి ఎదురెళ్లి పోరాడి... అక్రమ ఆస్తుల కేసులో జైలు కెళ్ళి.. దాదాపు 10యేళ్ళ పాటు రోడ్ల మీద తిరిగి.. రక రకాల వేషాలు వేసి, జనానికి ముద్దులు పెట్టి ఒళ్ళు నిమిరి, కులాన్ని ఉపయోగించి, తండ్రి బ్రాండ్ ఇమేజ్ ని వాడుకొని, ఆపై కోట్లు కుమ్మరించి, రాజకీయం చేసి అధికారంలోకి వచ్చాడు. జగన్ కి అధికారం అంత ఈజీగా ఒడిలోకి వచ్చి వాలిపోలేదు. దాని వెనక పదేళ్లు కష్టం ఉంది.
ఏపీ సీఎం జగన్ ను ఆయన చెల్లెలు షర్మిల కలుసుకోవడం ... రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనమే. ఎందుకంటే దాదాపు రెండేళ్ళ తరువాత అన్నాచెల్లెళ్ళు కలుసుకోగా.. అందుకోసం తల్లి విజయమ్మ రాయబారం చేయాల్సి వచ్చింది. అయితే జగన్ - షర్మిల కలుసుకున్న ఫోటోలు బయటకు ఎందుకు రాలేదు ? అసలు ఆ రూమ్ లో ఏం జరిగింది అన్నది ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్‌లో షర్మిల చేరడం.. ఏపీలో ప్రచారానికి సిద్ధం కావడం.. ఏ పార్టీని ముంచుతుంది.. ఏ పార్టీకి మేలు చేస్తుందనే చర్చపై రాజకీయవర్గాలు, సామాన్యుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్. షర్మిల చేరికతో లాభం అయ్యేది కాంగ్రెస్‌కే అనే చర్చ జరుగుతోంది.
వైఎస్ షర్మిల... ఏపీ కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈనెల 4న తన వైఎస్సార్ టీపీని హస్తం పార్టీలోకి విలీనం చేస్తారు. ఆ తర్వాత ఏపీ కాంగ్రెస్ లో చేరబోతున్నారు షర్మిల. అయితే ఆమెకు ఇప్పటికిప్పుడు ఏం పదవి ఇస్తారన్న దానిపై తర్జనభర్జనలు సాగుతున్నాయి.