Home » Tag » Yuzvendra Chahal
కౌంటీ క్రికెట్ లో భారత స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ దుమ్మురేపుతున్నాడు. తన స్పిన్ మ్యాజిక్ తో అదరగొడుతున్నాడు. జాతీయ జట్టుకు దూరమైన చాహల్ ప్రస్తుతం ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ లో నార్తంప్టన్‌షైర్‌కు ప్రాతనిథ్యం వహిస్తున్నాడు.
రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్ చరిత్రలోనే 350 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్రకెక్కాడు.
ఈ మెగా టోర్నీకి సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీని కూడా ఎంపిక చేశారు. ఇటీవలి కాలంలో వరుసగా విఫలమవుతున్న ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాకు కూడా జట్టులో చోటు దక్కింది.
మణికట్టు మాయాజాలంతో వికెట్లను రాబట్టే చాహల్‌ను వరల్డ్ కప్‌లో ఆడించాల్సిందని వాపోతున్నారు. అయితే చాహల్‌కు అవకాశం దక్కకపోయినా అతడి భార్య ధనశ్రీ వర్మ మాత్రం ప్రపంచకప్ టీమ్‌లో భాగమైంది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన వరల్డ్ కప్ యాంథెమ్‌లో చాహల్ సతీమణి భాగమైంది.
వరల్డ్ కప్ దగ్గర పడుతున్నా ఇంకా ఎక్స్పిరిమెంట్స్ చేస్తుండడంపై ఓ వైపు అభిమానులు గుర్రుగా ఉన్న సమయంలో మరోసారి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు ద్రవిడ్. విండీస్‌తో జరిగిన తొలి టీ20 సందర్భంగా యుజువేంద్ర చాహల్ బ్యాటింగ్‌కి దిగిన సమయంలో హెడ్ కోచ్ ద్రవిడ్, కెప్టెన్ హార్ధిక్ వ్యవహరించిన తీరు గల్లి క్రికెట్‌ను తలపించింది.
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు గంగూలీ ఓ ఆటగాడిపై జట్టు మేనేజ్మెంట్ ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరాడు. సీనియర్ స్పిన్నర్ యుజ్వెంద్ర చాహల్ కీలకంగా మారతాడని దాదా ఓ ఛానల్‌తో మాట్లాడుతూ అన్నాడు.
టీమ్ఇండియా తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్లో ఎన్నో రికార్డులు నెలకొల్పిన యుజ్వేంద్ర చాహల్ టెస్టుల్లో మాత్రం ఇంకా అరంగేట్రం చేయలేదు.