Home » తెలంగాణ
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు విచారించారు. గంట పాటు విచారణ చేసిన స్టేట్మెంట్ రికార్డ్ చేసారు పోలీసులు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ బంజారాహిల్స్ సిఐ ఫిర్యాదు గురించి నన్ను 32 ప్రశ్నలు అడిగారని నాపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.
ఈనెల 26న ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం అయింది.
భారత్ జోడో యాత్ర సమయంలో, ఎన్నికల సమయంలో 5 గ్యారంటీలు హామీ ఇచ్చామని.. వాటిని విజయవంతంగా అమలుచేసి చూపించాం అన్నారు. ఇప్పుడు ఢిల్లీలో కూడా అలాంటి హామీలు ఇస్తున్నామని తెలిపారు.
రాజకీయాల్లో కానీ, న్యాయ సంబంధిత వ్యవహారాల్లో కానీ.... సంక్షోభం వస్తే దాన్నుంచి ఎంత త్వరగా బయటపడాలో ఆలోచించాలి తప్ప.... ఆ సంక్షోభంలో కూడా పబ్లిసిటీ కొట్టేద్దామని ఆలోచిస్తే పరిస్థితి కేటిఆర్ లాగే ఉంటుంది.
తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ విషయంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ అధికారులు పక్క ప్లానింగ్ తో విచారణ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఉదయం 10:30కు ఈడి కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్ విచారణకు హాజరయ్యారు.
చివరి దశకి చేరుకుంది కాళేశ్వరం కమిషన్ ఎంక్వయిరీ. ఈ నెల 19 కి కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చేంద్ర ఘోష్ చేరుకోనున్నారు. రెండు నుంచి మూడు వారాల పాటు హైదరాబాద్ లోనే కమిషన్ చైర్మన్ ఉండనున్నారు.
కలెక్టర్లు క్షేత్రస్తాయికి వెళ్లి పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు. ఈ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తోందన్నారు సీఎం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన కులగణన సర్వే 96 శాతం పూర్తి చేసినందుకు జిల్లా కలెక్టర్లకు అభినందనలు తెలిపారు.
మాజీ మంత్రి కేటిఆర్ ను కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ఆయనపై మరో కేసు నమోదు చేసారు బంజారా హిల్స్ పోలీసులు.
మణికొండ లో హైడ్రా కూల్చివేతలు మొదలయ్యాయి. గత కొన్నాళ్ళుగా సైలెంట్ గా ఉన్న హైడ్రా అధికారులు ఇప్పుడు మళ్ళీ దూకుడు పెంచారు.
ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన డైలాగ్…విన్నారు కదా. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఇందులో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.