Home » Telangana Assembly Elections 2023
తెలంగాణలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్ల అంచనాలతో ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ను అసెంబ్లీలో మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు.
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు 2024-25
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన బుగ్గన
అయోధ్య శ్రీరామ మందిరంలో ప్రాణప్రతిష్ట
మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముత్తిరెడ్డికి.. జనగామ ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వలేదు BRS అధిష్టానం. ఆయన్ని బుజ్జగించడానికి ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఇచ్చినా.. ప్రభుత్వం మారడంతో ఆ పదవీ ఊడిపోయింది. తన టిక్కెట్ తీసుకొని ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి.. జనగామలో ప్రస్తుతం అధికారం చలాయిస్తున్నారు. ఇవన్నీ తలుచుకుంటే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కడుపు తరుక్కుపోతోంది. బీఆర్ఎస్ లో కొనసాగడం నింపుల కుంపటిలాగా ఉన్నట్టుంది.
కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు తెలంగాణలో చాలా మందే కష్టపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నవాళ్లంతా కాంగ్రెస్ గెలుపు కోసం పని చేశారు. కొందరు పార్టీలో చేరి ప్రత్యక్షంగా పని చేస్తే.. కొందరు మాత్రం పార్టీకి దూరంగా ఉంటూనే పరోక్ష సాయం అందించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ.. లోక్ సభ ఎన్నికల్లోనూ ఆ జోష్ కంటిన్యూ చేయాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నిలకు మించి ఫలితాలు రాబట్టాలని ప్లాన్ చేస్తున్నారు PCC చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లలో గెలిచే వాళ్ళకి టిక్కెట్లు ఇవ్వాలనీ.. సంక్రాంతి కల్లా అభ్యర్థుల పేర్లు ఖరారు చేయాలని చూస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల లోగా ఆరు గ్యారంటీలను అమలు చేస్తే.. ఇక తమకు తిరుగుఉండదని కాంగ్రెస్ లీడర్లు అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యుత్ రంగంపై చర్చలో భాగంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ముఖ్యంగా గత తొమ్మిదెన్నర పాలన, అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపై బీఆర్ఎస్ గట్టి కౌంటర్ ఇచ్చింది. శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని.. వాస్తవాలు దాచిపెట్టారంటూ బీఆర్ఎస్ మండిపడింది. తాము పదేళ్లలో సంపాదించిన ప్రగతి ఇదేనంటూ డాక్యుమెంట్ను రిలీజ్ చేసిన బీఆర్ఎస్.. శ్వేత పత్రానికి కౌంటర్ గా స్వేదపత్రంను ఇవాళ విడుదల చేయనుంది.
తెలంగాణ ఎన్నికల్లో 64 ఎమ్మెల్యేతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ఎంత త్వరగా ముగిసాయో లేదో.. ఇలా అసెంబ్లీ సమావేశాల్లో పాలక.. ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అసెంబ్లీలో సమావేశాలు మంచి జోరుగా రసవత్తరంగా జరుగుతున్నాయి. ఇక ప్రభుత్వం గత ప్రభుత్వం ఆర్ధిక, విద్యుత్ వంటి రంగాలపై శ్వేత పత్రం విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.
తెలంగాణ రాజకీయాల్లో ఈటెల రాజేందర్ పరిచయం అవసరం వ్యక్తి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ కుటుంబం తరువాత బీఆర్ఎస్ మీద అదే స్థాయి పట్టు ఉన్న ఏకైక నేత ఈటెల రాజేందర్. కానీ అంతర్గత విభేదాల కారణంగానే అదే పార్టీకి ఆయన దూరమయ్యారు. తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. హుజురాబాద్ బైపోల్లో బీజేపీ నుంచి పోటీ చేసి.. అప్పటి అధికార పక్షాన్ని కూడా పక్కకి నెట్టి ఘన విజయం సాధించారు. దీంతో ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.