తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ.. లోక్ సభ ఎన్నికల్లోనూ ఆ జోష్ కంటిన్యూ చేయాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నిలకు మించి ఫలితాలు రాబట్టాలని ప్లాన్ చేస్తున్నారు PCC చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లలో గెలిచే వాళ్ళకి టిక్కెట్లు ఇవ్వాలనీ.. సంక్రాంతి కల్లా అభ్యర్థుల పేర్లు ఖరారు చేయాలని చూస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల లోగా ఆరు గ్యారంటీలను అమలు చేస్తే.. ఇక తమకు తిరుగుఉండదని కాంగ్రెస్ లీడర్లు అభిప్రాయపడుతున్నారు. Politics : ఇక నుంచి రాజకీయంగా నా టార్గెట్ అదే నేనేంటో చూపిస్తా తెలంగాణలో మొన్నటి దాకా అసెంబ్లీ ఎన్నికల హడావిడి నడిచింది. మరో మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. వీటిల్లో కూడా సత్తా చాటాలని కాంగ్రెస్ టార్గెట్ గా పెట్టుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 9 నుంచి 11 ఎంపీ స్థానాలు దక్కుతాయని ABP- C VOTER ఒపీనియన్ పోల్ లో వెల్లడైంది. బీఆర్ఎస్ పార్టీ 3 నుంచి 5 సీట్లే గెలుస్తుందనీ.. బీజేపీ పరిస్థితి మరింత దిగజారుతుందని ఈ సర్వే ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు 38 శాతం దాకా ఓట్లు పోల్ అవుతాయని వివరించింది సీ ఓటర్ ఒపీనియన్ పోల్. ఈ పోల్ తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. సీఎం రేవంత్ రెడ్డినే పీసీసీ చీఫ్ గా కూడా కొనసాగుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల దాకా ఆయన్నే కంటిన్యూ చేస్తారనే టాక్ నడుస్తోంది. దాంతో లోక్ సభ ఎన్నికల్లోనూ మాగ్జిమమ్ సీట్లు గెలుచుకోవాలని రేవంత్ భావిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఈసారి గెలిచేవాళ్ళకే టిక్కెట్లు ఇవ్వాలి.. అసెంబ్లీ టిక్కెట్లు నిరాకరించినవారిలో సమర్థులు ఎవరున్నారు లాంటి అంశాలను బేరీజు వేస్తున్నారు. అంతేకాదు.. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల నాటికి తాము ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తే.. ఇక కాంగ్రెస్ పార్టీకి తిరుగు ఉండదని భావిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ నుంచి AICC అగ్రనేత సోనియాగాంధీ పోటీచేయాలంటూ PCC రాజకీయ వ్యవహారాల కమిటీ తీర్మానం చేసి పంపింది. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆమె పోటీ చేయకపోయినా.. ప్రియాంక గాంధీ నిలబడితే ఎలా ఉంటుంది అన్న టాక్ కూడా కాంగ్రెస్ లో నడుస్తోంది. నల్లగొండ లేదా ఖమ్మం నుంచి సోనియా లేదా ప్రియాంకలో ఎవరో ఒకరు పోటీ చేయాలని కోరుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లోని 36 అసెంబ్లీ సీట్లల్లో 32 కాంగ్రెస్ కి దక్కాయి. దాంతో ఈ జిల్లాల పరిధిలోని ఖమ్మం, నల్లగొండ, భువనగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానాలు హాట్ సీట్లుగా మారాయి. ఖమ్మం నుంచి రేణుకా చౌదరి పోటీ చేయాలని ఉన్నా.. పొంగులేటి సోదరుడు, భట్టి భార్య పేరు కూడా వినవస్తున్నాయి. నల్లగొండ నుంచి పోటీకి సిద్ధమని సీనియర్ నేత జానారెడ్డి ప్రకటించారు. పెద్దపల్లికి వివేక్ వెంకటస్వామి కొడుకు గడ్డం వంశీ పేరు పరిశీలనలో ఉంది. వరంగల్ ఎస్సీ నియోజకవర్గం నుంచి టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మల్కాజ్ గిరికి మైనంపల్లి హనుమంతరావుతో పాటు కుసుమ్ కుమార్ కూడా పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ నుంచి ఎంపీ సీటును ఆశిస్తున్న వారిలో సీఎం రేవంత్ రెడ్డి అనుచరులతో పాటు, పార్టీ సీనియర్లు.. మాజీ ఎంపీలు, ప్రస్తుత రాష్ట్ర మంత్రుల బంధువులు కూడా ఉన్నారు. అయితే గెలిచేవాళ్ళు, ఎన్నికల ఖర్చులు భరించేవారికే కాంగ్రెస్ హైకమాండ్.. ఎంపీ టిక్కెట్లు కేటాయించే అవకాశాలున్నాయి.