Asaduddin Owaisi: తొమ్మిది స్థానాల్లో ఎంఐఎం పోటీ.. అభ్యర్థుల్ని ప్రకటించిన ఒవైసీ..
ఈ అంశంపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. దారుసలాంలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తమకు బలం ఉన్న తొమ్మిది స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

Asaduddin Owaisi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (assembly elections) ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనేదానిపై ఎంఐఎం (AIMIM) కీలక నిర్ణయం తీసుకుంది. తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ అంశంపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) శుక్రవారం కీలక ప్రకటన చేశారు. దారుసలాంలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తమకు బలం ఉన్న తొమ్మిది స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
JANASENA: వెనక్కి తగ్గిన పవన్..? తెలంగాణలో జనసేన పోటీ కష్టమే..!
హైదరాబాద్ పరిధిలోని నాంపల్లి, చార్మినార్, చాంద్రాయణగుట్ట, బహుదూర్‌పురా, కార్వాన్, యాకుత్ పురా, మలక్ పేట స్థానాల్లో ఎంఐఎం పోటీ చేయబోతుంది. అలాగే జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ స్థానాల్లో సైతం పోటీ చేస్తామని వెల్లడించింది. తాజా ఎన్నికల్లో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న ముంతాజ్ అహ్మద్ ఖాన్, సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ పోటీ చేయడం లేదన్నారు. అయితే, వీళ్లు పార్టీ గెలుపు కోసం పని చేస్తారని అసదుద్దీన్ తెలిపారు. వీరిపై స్తానికంగా వ్యతిరేకత ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరి స్థానాల్లో కొత్త వారిని ఎంపిక చేస్తారు. ఎంఐఎం పోటీ చేయబోయే స్థానాల్లో ఆరు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. చాంద్రాయణగుట్ట నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ, చార్మినార్ నుంచి మీర్ జుల్ఫీకర్ అలీ సాహబ్, యాకుత్ పురా నుంచి జాఫర్ హుస్సేన్ మెహరాజ్ సాహబ్, మలక్‌పేట నుంచి అహ్మద్ బలాలా, కార్వాన్ నుంచి కౌసర్ మొహియుద్దీన్ సాహబ్, నాంపల్లి నుంచి మాజిద్ హుస్సేన్ సాహబ్ పోటీ చేయబోతున్నారు.
Varun Tej: వరుణ్ తేజ్ పెళ్లి కోసం ఎంత ఖర్చు చేశారో తెలుసా..!
మిగతా నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని త్వరలోనే ఎంపిక చేస్తారు. కాగా, బీఆర్ఎస్ పార్టీ.. తమకు ఎంఐఎంతో స్నేహపూర్వక పోటీ ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే. అందుకే రెండు పార్టీలూ, తాజా ఎన్నికల్లో పరస్పరం సహకరించుకుంటాయి. ఎంఐఎం బలంగా ఉన్న చోట.. బీఆర్ఎస్ నామమాత్రంగా పోటీ చేస్తుంది. బీఆర్ఎస్‌కు ఎంఐఎం సహకరిస్తుంది. కాగా, ప్రతిపార్టీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టో విడుదల చేయాలి. ఆ మేనిఫెస్టోను ఎన్నికల సంఘానికి సమర్పించాలి. కానీ, ఎంఐఎం మాత్రం ఆ పని చేయదు. తమకు మేనిఫెస్టో లేదని ఈసీకి చెబుతుంది.