Telangana Assembly: బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే..

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అలంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం.. శుక్రవారం బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి, కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 24, 2023 | 02:27 PMLast Updated on: Nov 24, 2023 | 2:27 PM

Alampur Brs Mla Abraham Joins In Congress Party In The Presence Of Revanth Reddy

Telangana Assembly: ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి, కాంగ్రెస్‌లో చేరారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అలంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం.. శుక్రవారం బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి, కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. అబ్రహం పార్టీని వీడేందుకు కారణం ఉంది. ఇక్కడ సిట్టింగ్‌గా ఉన్న అబ్రహంకు మొదట సీఎం కేసీఆర్ టిక్కెట్ కేటాయించారు.

CHANDRABABU NAIDU: చంద్రబాబుకు ఊరట.. ఇన్నర్ రింగ్‌ రోడ్ కేసులో చర్యలొద్దని ఆదేశం

అయితే, బీఫాం ఇచ్చే సమయానికి అబ్రహంకు హ్యాండ్ ఇచ్చారు. అబ్రహం బదులు విజేయుడుకు బీఆర్ఎస్ టిక్కెట్ ఇచ్చారు. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఒత్తిడిమేరకు అబ్రహంను కాదని.. విజేయుడుకు టిక్కెట్ ఇచ్చారు కేసీఆర్. చివరి నిమిషంలో షాక్ తగలడంతో అబ్రహం కొద్ది రోజులగా బీఆర్ఎస్‌పై అసంతృప్తితో ఉన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ తరఫున అలంపూర్ నుంచి పోటీ చేస్తున్న సంపత్ కుమార్ వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. అబ్రహంకు టిక్కెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్‌పై అసంతృప్తితో ఉన్న నేతలను తనవైపు తిప్పుకుంటున్నారు. కొద్ది రోజులుగా బీఆర్ఎస్ నేతలు సంపత్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఇదే క్రమంలో సంపత్ కుమార్ చొరవతో, అబ్రహం కాంగ్రెస్‌‌లో చేరేందుకు అంగీకరించారు.

ఇది సంపత్ కుమార్ విజయానికి దోహదం చేస్తుందని స్థానికులు భావిస్తున్నారు. నిజానికి అబ్రహంకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా స్థానికంగా మంచి ఆదరణే ఉంది. బీఆర్ఎస్ టిక్కెట్ దక్కకపోయినా.. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారని భావించారు. కానీ, పోటీలో నిలబడలేదు. దీంతో ఆయన్ను కాంగ్రెస్ తనవైపు తిప్పుకొంది. ఇది కాంగ్రెస్ విజయానికి ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి. ప్రస్తుతం అలంపూర్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గట్టిపోరు నడుస్తోంది.