KCR Pragati Bhavan : సున్నాలేస్తున్నారంటగా.. KCR ప్రగతి భవన్‌ ఖాళీ చేస్తున్నారా ?

తెలంగాణలో ఏ మూల చూసినా ఇప్పుడు ఒకటే డిస్కషన్ నడుస్తోంది. ఏ ఇద్దరు కలిసినా ఒకటే టాపిక్‌ వస్తోంది. గెలిచేది ఏ పార్టీ.. ఓడిపోయేది ఏ పార్టీ. ఈ ఎలక్షన్‌ నిరుడు లెక్క కాదు.. పక్కా వేరే లెక్క ఉంటది. అందులో ఎలాంటి డౌట్‌ లేదు. ఎవరు గెలిచినా.. మార్జిన్‌ మాత్రం చాలా చిన్నగా ఉంటుంది. ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేలు కూడా ఏదీ తేల్చలేకపోయాయంటే.. ఫైట్‌ ఏ రేంజ్‌తో జరిగిందో అర్థం చేసుకోవచ్చు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 2, 2023 | 05:32 PMLast Updated on: Dec 02, 2023 | 6:13 PM

Are You Vacating Kcr Pragati Bhavan

తెలంగాణలో ఏ మూల చూసినా ఇప్పుడు ఒకటే డిస్కషన్ నడుస్తోంది. ఏ ఇద్దరు కలిసినా ఒకటే టాపిక్‌ వస్తోంది. గెలిచేది ఏ పార్టీ.. ఓడిపోయేది ఏ పార్టీ. ఈ ఎలక్షన్‌ నిరుడు లెక్క కాదు.. పక్కా వేరే లెక్క ఉంటది. అందులో ఎలాంటి డౌట్‌ లేదు. ఎవరు గెలిచినా.. మార్జిన్‌ మాత్రం చాలా చిన్నగా ఉంటుంది. ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేలు కూడా ఏదీ తేల్చలేకపోయాయంటే.. ఫైట్‌ ఏ రేంజ్‌తో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. మరికొన్ని గంటల్లోనే ఈ సస్పెన్స్‌కు తెరపడబోతోంది.  ఈ సమయంలో ప్రగతి భవన్‌కు కేసీఆర్‌ సున్నాలు వేయించడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రగతి భవన్‌కు కార్మికులు సున్నాలు వేస్తున్న ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

KCR PLANT: కేసీఆర్ ఓడిపోవడం ఖాయమా.. ఎండిపోయిన మొక్క చెప్తోంది అదేనా..

మరోసారి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సే అని.. హ్యాట్రిక్‌ సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు ప్రగతి భవన్‌ను కేసీఆర్‌ ముస్తాబు చేయిస్తున్నారని బీఆర్ఎస్‌ నేతలు చెప్తున్నారు. కానీ కాంగ్రెస్‌ వాళ్లు మాత్రం.. కేసీఆర్‌ ప్రగతిభవన్‌ ఖాళీ చేయాల్సిన టైం వచ్చిందని.. కాంగ్రెస్‌కు దాన్ని కొత్తగా అప్పగించేందుకే సున్నాలు వేయిస్తున్నారని ఫొటో వైరల్‌ చేస్తున్నారు. ఈ సున్నాల సంగతి ఇలా ఉంటే.. ప్రగతి భవన్‌లో పని చేసే వర్కర్లకు కేసీఆర్‌ గిఫ్టులు ఇస్తున్నారనే విషయం మరో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ విషయంలో బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ఎవరికి నచ్చింది వాళ్లు వైరల్‌ చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ గెలవబోతుండటంతో కేసీఆర్‌ గిఫ్ట్‌లు ఇస్తున్నారంటూ బీఆర్‌ఎస్‌ నేతలు చెప్తున్నారు. కానీ కాంగ్రెస్‌ నేతలు మాత్రం అవి వీడ్కోలు గిఫ్ట్‌లు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇల్లు వదిలి వెళ్తున్నప్పుడు పని చేసిన వర్కర్లకు గిఫ్ట్‌లు ఇవ్వడం మర్యాద అని.. ప్రస్తుతం కేసీఆర్‌ అదే చేస్తున్నారంటూ చెప్తున్నారు. ఈ మాటల యుద్ధం ఎలా ఉన్నా.. ఈసారి టఫ్‌ ఫైట్‌ మాత్రం తప్పేలా లేదు. రాజాకీయాలకు దూరంగా ఉండే సామాన్య వ్యక్తుల్లో కూడా ఈ ఎన్నిక ఆసక్తిని రేపింది. దాదాపు 30 నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు జరిగింది. ఈ సెగ్మెంట్లలో గెలుపు ఓటములను ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. ఈ 30 నియోజకవర్గాలే తెలంగాణ భవితవ్యాన్ని డిసైడ్‌ చేయబోతున్నాయని అందరూ అనుకుంటున్నారు.  మరి ఓటర్లు ఎవరికి పట్టం కట్టారు.. ఎవరిని ఇంటికి పంపించబోతున్నారో తెలియాలంటే డిసెంబర్‌ 3 మధ్యాహ్నాం దాకా ఆగాల్సిందే.