Balayya : రేవంత్‌కు బాలయ్య కంగ్రాట్స్‌..

తెలంగాణ సీఎంగా రేవంత్ ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయ్. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు.. కీలక పార్టీల అధినేతలకు కూడా ఆహ్వానం అందింది. ఏపీ సీఎం జగన్‌తో పాటు.. టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను కూడా కాంగ్రెస్ పెద్దలు ఇన్వైట్‌ చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 6, 2023 | 02:47 PMLast Updated on: Dec 06, 2023 | 2:47 PM

Balayya Congrats To Revanth

తెలంగాణ సీఎంగా రేవంత్ ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయ్. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు.. కీలక పార్టీల అధినేతలకు కూడా ఆహ్వానం అందింది. ఏపీ సీఎం జగన్‌తో పాటు.. టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను కూడా కాంగ్రెస్ పెద్దలు ఇన్వైట్‌ చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడానికి ముందు టీడీపీలో పనిచేశారు. ఆ పార్టీలో చేరిన తర్వాతే రేవంత్ రెడ్డి నాయకుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇక అటు రేవంత్‌కు అన్ని రంగాల ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయ్. ప్రముఖ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రేవంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Telangana Assembly : కేసీఆర్‌ కాదు.. ప్రతిపక్ష నేత ఆయనే!

తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఎనుముల రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు.. ప్రజాసేవే పరమావధిగా రాజకీయాల్లో అంచెలంచెలుగా రేవంత్ రెడ్డి ఎదిగారు. తెలంగాణ దనావు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి ఆంక్షలు నెరవేర్చాలి.. అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి పరంగా ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నాను. ముఖ్యమంత్రిగా మీ మార్క్ పాలనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను అంటూ బాలకృష్ణ ప్రకటన విడుదల చేశారు. బాలకృష్ణతో రేవంత్ రెడ్డికి మంచి అనుబంధం ఉంది. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని ప్రకటన వచ్చిన వెంటనే బాలకృష్ణ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు ప్రకటించిన‌ప్పటి నుంచి పలువురు టీడీపీ నాయకులు, ఏపీకి చెందిన ఇతర పార్టీల నాయకులు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. రేవంత్ రెడ్డి గురువుగా భావించే చంద్రబాబు కానీ, ఆయన తనయుడు నారా లోకేష్ కానీ, ఇంతవరకు స్పందించకపోవడం హైలైట్.