BANDI SANJAY: నోట్ల కట్టలు పంచలేదని ప్రమాణం చేద్దామా.. గంగులకు బండి సవాల్..
డబ్బులు, మద్యం పంచలేదని భాగ్యలక్ష్మి దేవాలయం ముందు ప్రమాణం చేస్తావా? అంటూ ఆయన బండి సంజయ్‌కు సవాల్ చేశారు. తడి బట్టలతో ఇద్దరం దేవాలయంకు వెళ్దామని.. వస్తావా? అని ప్రశ్నించారు. తాజాగా ఈ సవాల్‌కు బండి సంజయ్ స్పందించారు.
BANDI SANJAY: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్, బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ పరస్పర సవాళ్లు విసురుకున్నారు. బుధవారం బండిపై గంగుల ఆరోపణలు చేశారు. బండి సంజయ్, గంగుల కమలాకర్.. ఎవరికి వారు తమదే గెలుపంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. బండి సంజయ్ ఓటర్లను ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు మంత్రి గంగుల కమలాకర్.
Kishan Reddy: బీఆర్ఎస్ మాల్ ప్రాక్టీస్.. ఈసీకి కిషన్ రెడ్డి ఫిర్యాదు..!
బండి సంజయ్ సీసీ టీవీ ఫుటేజ్‌ను గంగుల విడుదల చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘించి బీజేపీవాళ్లు డబ్బులు, మద్యం పంపిణీ చేస్తున్నారని గంగుల అన్నారు. ఎంపీ స్థాయిలో హుందాగా ఉండాల్సినవారు అలా చేయడం ఏంటని ప్రశ్నించారు గంగుల. కొత్తపల్లిలో బండి సంజయ్ డబ్బులు పంచుతుంటే బీఆర్ఎస్ నేతలు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారని, చివరకు బండి తమపైనే ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బండి సంజయ్‌కు ఓటు అడిగే హక్కు లేదన్నారు. ఎందుకంటే.. ప్రధాని మోదీ వస్తే రాష్ట్రానికి కనీసం రూపాయి నిధులైనా తెచ్చారా? అని ప్రశ్నించారు. బండి మూడోసారి కూడా ఓడిపోతారన్నారు. అంతేకాదు.. డబ్బులు, మద్యం పంచలేదని భాగ్యలక్ష్మి దేవాలయం ముందు ప్రమాణం చేస్తావా? అంటూ ఆయన బండి సంజయ్‌కు సవాల్ చేశారు.
తడి బట్టలతో ఇద్దరం దేవాలయంకు వెళ్దామని.. వస్తావా? అని ప్రశ్నించారు. తాజాగా ఈ సవాల్‌కు బండి సంజయ్ స్పందించారు. గంగుల సవాల్ స్వీకరిస్తున్నానని, ఓటర్లకు డబ్బులుపంచలేదని తడిబట్టలతో ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమని బండి ప్రకటించారు. ఎక్స్ వేదికగా గంగులకు సవాల్ విసిరారు. కొత్తపల్లిలో డబ్బులు పంచిన బీఆర్‌ఎస్ నాయకులను చూపిస్తా వాళ్లతో కూడా ప్రమాణం చేయించే సత్తా ఉందా అని ప్రశ్నించారు.
‘గంగుల… ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’
ధర్మం ధైర్యంగా ప్రశ్నిస్తుంది… అధర్మం అభద్రతతో పారిపోతుంది. నువ్వు ఓటమి భయంతో ఓటర్లకు డబ్బు కట్టలు ఎర వేస్తున్నావు. అడ్డంగా దొరికి అడ్డగోలుగా అసత్యాల ప్రచారం చేస్తున్నావు. నిజం ఒప్పుకోలేక సిగ్గు వదిలి నువ్వు చేస్తున్న ఎదురు విమర్శలు…
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) November 29, 2023