Bandi Sanjay, padayatra : మరో పాదయాత్రకు సిద్ధమైన బండి..ఈసారి అంతకుమించి
బండి సంజయ్‌ను అధ్యక్షుడిగా తప్పించి.. కిషన్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించిన తర్వాత.. తెలంగాణలో బీజేపీ పరిస్థితి తలకిందులు అయింది. బండి ఉంటే ఇంకోలా ఉండేది సీన్ అనే పోలికలు మొదలయ్యాయి. ఇలాంటి పరిణామాల మధ్య బండి సంజయ్ సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని బీజేపీ అధిష్టానం ఫిక్స్ అయింది. బండి సంజయ్ మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 7 నుంచి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర చేయబోతున్నారు.
బండి సంజయ్ ( Bandi Sanjay ) ను అధ్యక్షుడిగా తప్పించి.. కిషన్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించిన తర్వాత.. తెలంగాణలో బీజేపీ పరిస్థితి తలకిందులు అయింది. బండి ఉంటే ఇంకోలా ఉండేది సీన్ అనే పోలికలు మొదలయ్యాయి. ఇలాంటి పరిణామాల మధ్య బండి సంజయ్ సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని బీజేపీ అధిష్టానం ఫిక్స్ అయింది. బండి సంజయ్ మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 7 నుంచి కరీంనగర్ ( Karimnagar )అసెంబ్లీ నియోజకవర్గ ( assembly constituency ) పరిధిలో పాదయాత్ర ( padayatra ) చేయబోతున్నారు. ప్రతీరోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం వరకు.. సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు పాదయాత్ర చేస్తారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేడ్కర్‌నగర్‌లోని 24వ డివిజన్‌లో ఫస్ట్ డే పాదయాత్ర చేస్తారు. ఒకవైపు తన నియోజకవర్గంలో పాదయాత్ర చేయడంతోపాటు.. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారానికి రావాలంటూ పార్టీ నాయకత్వంపై పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తుండటంతో.. బండి సంజయ్‌కి బీజేపీ ప్రత్యేకంగా హెలికాప్టర్ కేటాయించింది.
Pakistan : పాకిస్తాన్ కి ఇదేం బుద్ది..? ఆఫ్గాన్లపై ఇంత దారుణమా..?
ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేయాలని కోరింది. మిగిలిన సమయాన్ని తాను పోటీ చేస్తున్న కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి కేటాయించాలని సూచించింది. 8, 9, 10వ తేదీల్లో ఎక్కడెక్కడ ప్రచారం చేయాలనే అంశంపై షెడ్యూల్ రూపొందించింది. తొలి రోజు సిరిసిల్ల, నారాయణపేట.. తర్వాత ఖానాపూర్, మహేశ్వరం నియోజకవర్గంలో ప్రచారం చేయాలని బండి సంజయ్ నిర్ణయించారు. దీంతోపాటు బండి సంజయ్ భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ కారు అనుమతి ఇచ్చింది. బండి సంజయ్ ఈ నెల 6న కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు.