Kolhapur MLA Barrelakka : ఎమ్మెల్యేగా నామినేషన్ వేసిన బర్రెలక్క..
మహబూబ్‌నగర్ జిల్లా (Palamuru district) కొల్లాపూర్ (Kolhapur) ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయన్సర్ శిరీష్ నామినేషన్ వేశారు. శిరీష ఎవరు అనుకుంటున్నారు కదా. అవును శిరీష అనడం కంటే బర్రెలక్క (Barrelakka) అంటేనే ఆమెను అంతా గుర్తుపడతారు. బర్రెలక్కగానే ఆమె చాలా ఫేమస్. తెలంగాణలో ఉద్యోగాలు లేవంటూ కొంత కాలం క్రితం శిరీష ఓ వీడియో చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లా (Palamuru district) కొల్లాపూర్ (Kolhapur) ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయన్సర్ శిరీష్ నామినేషన్ వేశారు. శిరీష ఎవరు అనుకుంటున్నారు కదా. అవును శిరీష అనడం కంటే బర్రెలక్క (Barrelakka) అంటేనే ఆమెను అంతా గుర్తుపడతారు. బర్రెలక్కగానే ఆమె చాలా ఫేమస్. తెలంగాణలో ఉద్యోగాలు లేవంటూ కొంత కాలం క్రితం శిరీష ఓ వీడియో చేశారు. బర్రెలు కాచుకోవడం బెటర్ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ పెట్టారు. అప్పట్లో ఆ రీల్ మామూలుగా వైరల్ కాలేదు. సోషల్ మీడియాలో శిరీషకు విపరీతమైన ఫాలోవర్స్ పెరిగాపు. ఇప్పుడామెకు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు నాలుగున్నర లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.
బర్రెల రీల్ చేసినప్పటి నుంచీ శిరీషకు అంతా బర్రెలక్క అని పేరుపెట్టేశారు. అప్పటి నుంచీ రెగ్యులర్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తున్నారు శిరీష. సామాజిక అంశాలపై స్పందిస్తూ ఉంటారు. అలాంటి శిరీష ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే నామినేషన్ వేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అప్పుచేసి మరీ నామినేషన్ వేశానని.. ప్రజలు తనను దీవించాలని కోరుతున్నారు. శిరీష చేసిన పనిని సోషల్ మీడియాలో అంతా మెచ్చుకుంటున్నారు. ప్రతీ నామినేషన్ గెలిచేందుకు కాదని.. కొన్ని విషయాలు ప్రపంచానికి తెలిపేందుకు కూడా పనికి వస్తాయంటున్నారు. శిరీష నామినేషన్‌లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తెలంగాణ మొత్తానికి తెలియాలంటూ పోస్టులు పెడుతున్నారు. శిరీషకు అంతా ఓటువేయాలని.. కొల్లాపూర్ వచ్చి ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఎన్నికల్లో శిరీషు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.