BARRELAKKA: సంచలనంగా మారిన ఎగ్జిట్ పోల్స్.. బర్రెలక్కకు ఎన్ని ఓట్లు వస్తాయంటే..
బర్రెలక్క అలియాస్ శిరీష విషయంలో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ సర్వే ఇప్పుడు సంచలనంగా మారింది. కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిరీషకు 15 వేల ఓట్లు వచ్చే అవకాశం ఉందని ఆరా మస్తాన్ అనే సర్వే సంస్థ తన సర్వేలో తెలిపింది.
BARRELAKKA: తెలంగాణలో పోలింగ్ ముగిసింది. గతంతో కంపేర్ చేసుకుంటే తక్కువ శాతం పోలింగ్ నమోదైనప్పటికీ.. ఈ సంవత్సరం ఎన్నికలు అత్యంత ఆసక్తిగా మారాయి. తెలంగాణలో ఏ పార్టీ అధికారాన్ని చేపట్టబోతోందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇక తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కొల్లాపూర్ అభ్యర్థి బర్రెలక్క అలియాస్ శిరీష విషయంలో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ సర్వే ఇప్పుడు సంచలనంగా మారింది. కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిరీషకు 15 వేల ఓట్లు వచ్చే అవకాశం ఉందని ఆరా మస్తాన్ అనే సర్వే సంస్థ తన సర్వేలో తెలిపింది.
ASSEMBLY ELECTIONS: సెంటిమెంట్ పాలిటిక్స్.. కారును వెంటాడుతున్న శ్రీకాంతాచారి త్యాగం..?
కొల్లాపూర్‌లో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న జూపల్లి కృష్ణారావు గెలిచే చాన్స్ ఉన్నట్టు ఆరా సంస్థ ప్రకటించింది. అయితే మిగిలిన రెండు లీడింగ్ పార్టీలకు బర్రెలక్క గట్టి పోటీ ఇవ్వబోతున్నట్టు ఆరా సర్వేలో తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్ వీడియోల ద్వారా ఫేమస్ అయిన బర్రెలక్క నిరుద్యోగుల గురించి చేసిన వీడియోతో వైరల్‌గా మారింది. వీలు దొరికిన ప్రతీ సారి ప్రభుత్వ వైఫల్యాల గురించి వీడియోలు చేసేది శిరీష. ప్రజల నుంచి వస్తున్న ఆదరణతో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. కుటుంబ సభ్యుల సహకారంతో కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసింది. కొల్లాపూర్‌లో శిరీషకు ఎవరూ ఊహించని మద్దతు లభించింది. లాయర్లు, మాజీ అధికారులు కూడా శిరీషకు మద్దతు తెలిపారు.
శిరీష ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్, సోషల్ యాక్టివిస్టులు శిరీష కోసం స్వచ్ఛందంగా ప్రచారం చేశారు. దీంతో ఒక్కసారిగా తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా శిరీష హాట్ టాపిక్‌గా మారింది. అయితే కొల్లాపూర్‌లో శిరీష గెలిచే చాన్స్ లేకపోయినా.. అధికార ప్రతిపక్షాలను టెన్షన్ పెట్టే స్థాయిలో ఓట్లు రాబట్టబోతోందని ఆరా సర్వేలో తేలింది. ఇక నిజంగా శిరీషకు ఎన్ని ఓట్లు వస్తాయో డిసెంబర్ 3న చూడాలి.