BRS party : బీఆర్ఎస్ కి గుర్తుల భయం.. ఏయే నియోజకవర్గాల్లో ఎఫెక్ట్ అంటే..!
తెలంగాణ (Telangana) లో బీఆర్ఎస్ పార్టీకి మళ్లీ గుర్తుల భయం పట్టుకుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ మళ్లీ కారును పోలిన సింబల్స్ ఇండిపెండెంట్స్ కి కేటాయించింది ఈసీ. అలాంటి గుర్తులు కేటాయించకుండా చర్యలు తీసుకోవాలి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆ తర్వాత సుప్రీంకోర్టును కోరినా BRS కు రిలీఫ్ రాలేదు.

BRS party in Telangana is again afraid of symbols in which constituencies the effect is
తెలంగాణ (Telangana) లో బీఆర్ఎస్ పార్టీకి మళ్లీ గుర్తుల భయం పట్టుకుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ మళ్లీ కారును పోలిన సింబల్స్ ఇండిపెండెంట్స్ కి కేటాయించింది ఈసీ. అలాంటి గుర్తులు కేటాయించకుండా చర్యలు తీసుకోవాలి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆ తర్వాత సుప్రీంకోర్టును కోరినా BRS కు రిలీఫ్ రాలేదు. గత ఎన్నికల్లో లాగే ఇప్పుడు కూడా కారులాగా ఉండే రోడ్డు రోలర్, రోటీ మేకర్ కు మళ్లీ ఓట్లు పడతాయన్న భయం గులాబీ పార్టీ అభ్యర్థుల్లో కనిపిస్తోంది.
కారు గుర్తును పోలిన సింబల్స్ ఉండటంతో 2018 అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్ సభ ఎన్నికల్లో తమకు నష్టం జరిగిందని బీఆర్ఎస్ వాదిస్తోంది. ట్రక్కు, రోడ్ రోలర్, ఆటో రిక్షా, రోటీ మేకర్, కెమెరా, టీవీ, ఓడ, కుట్టు మిషన్ లాంటి గుర్తులను కేటాయించవద్దని BRS ముందు నుంచీ కేంద్ర ఎన్నికల కమిషన్ తో పోరాటం చేస్తోంది. 2011లో ఈసీ రోడ్ రోలర్ ను తొలగించింది.. కానీ ఈ మధ్యే యుగ తులసి పార్టీకి రోడ్ రోలర్ గుర్తును ఎలాట్ చేసింది. కారును పోలిన గుర్తులను ఆపాలంటూ ఈమధ్యే ఢిల్లీ హైకోర్టు.. ఆ తర్వాత సుప్రీంకోర్టును BRS ఆశ్రయించింది. కానీ ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కారుకు ఇతర గుర్తులకు మధ్య తేడా తెలుసుకోలేనంత పరిస్థితుల్లో ఓటర్లు లేరని కూడా న్యాయమూర్తులు కామెంట్ చేశారు.
KODANDARAM: కోదండరామ్‌కి ఎంపీ సీటు..! కాంగ్రెస్ ఆఫర్.. అందుకే మద్దతు..
2018 అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గంలో పోటీ చేసిన వేముల వీరేశం 8 వేల 259 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అలాగే తాండూరు, సంగారెడ్డి, కొల్లాపూర్, హుజూర్ నగర్ , మునుగోడు, పినపాక, సత్తుపల్లి, భద్రాచలం లాంటి సీట్లల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. వీటిల్లో ట్రక్కు, రోటీ మేకర్, టీవీ లాంటి గుర్తులకు ఎక్కువ ఓట్లు పడటం వల్లే తమకు నష్టం జరిగిందని బీఆర్ఎస్ వాదిస్తోంది. 2018లో మొత్తం 58 నియోజకవర్గాల్లో ట్రక్ గుర్తుతో అభ్యర్థులు పోటీ చేయగా.. 21 స్థానంలో ఈ గుర్తు గల అభ్యర్థులు.. 3వ స్థానంలో నిలిచారు. 22 సీట్లలో నాలుగో ప్లేసులో ఉన్నారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ రోడ్ రోలర్ గుర్తును ఈ అసెంబ్లీ ఎన్నికల్లో యుగతులసి పార్టీకి కేటాయించింది. ఆ పార్టీ అభ్యర్థులు లేని చోట్ల వేరే స్వతంత్రులకు ఈ సింబల్ ను ఎలాట్ చేశారు. యుగతులసి పార్టీ అభ్యర్థులు LB నగర్, ఇబ్రహీంపట్నం, శేరిలింగంపల్లి, కల్వకుర్తి నియోజకవర్గాల్లో పోటీలోఉన్నారు. వీళ్ళందరికీ EVMలో రోడ్ రోలర్ గుర్తు ఉంటుంది. రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి నవరంగ్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీలో ఉన్న మహమ్మద్ అబ్దుల్ అజీజ్ కు.. ఆ తర్వాత షాద్ నగర్, చేవెళ్ళ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న ఇండిపెండెంట్లకు రోడ్ రోలర్ సింబల్ ఎలాట్ అయింది. దాంతో ఈసారి కూడా తాము ఓట్లు కోల్పోతామని ఆయా నియోజకవర్గాల్లోని BRS అభ్యర్థులు భయపడుతున్నారు.
సాధారణంగా గుర్తింపు పొందిన పార్టీకి శాశ్వతంగా ఒకే గుర్తును ఎన్నికల కమిషన్ కేటాయిస్తుంది. గుర్తుంపు లేని పార్టీలకు అవకాశాన్ని బట్టి ఆ రాష్ట్రంలో ఉమ్మడి సింబల్ ఇస్తుంది. మరో ఎన్నికల్లో మరో గుర్తు కూడా వచ్చే ఛాన్సుంది. ఎన్నికల కమిషన్ పార్టీలకు తమ దగ్గర అందుబాటులో ఉన్న గుర్తుల నుంచి ఒక దాన్ని ఎంపిక చేసుకోవాలని సూచిస్తుంది. పార్టీలు 3 ఆప్షన్లు ఇస్తే…వాటి నుంచి ఒక దాన్ని ఎంపిక చేస్తారు.