Telangana Assembly Elections: తెలంగాణ ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్.. సీటు కేటాయించిన బీఎస్పీ..
ఇప్పటి వరకూ జరిగిన ఏ ఎన్నికలలో ట్రాన్స్‌జెండర్ పోటీ చేయలేదు. ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఒక ట్రాన్స్‌జెండర్ పోటీ చేయబోతున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సారథ్యంలోని బీఎస్పీ .. ఈసారి అన్ని స్థానాల్లోనూ బరిలోకి దిగుతోంది.

Telangana Assembly Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సంథింగ్ స్పెషల్ అనిపిస్తున్నాయ్. అంచనాలకు మించిన ఫలితాలు రావచ్చనే అభిప్రాయానికి ఇప్పటికే వచ్చేశారు జనాలు. హ్యాట్రిక్ సాధించి తెలంగాణలో తమ పట్టు ఎంత ఉందో చెప్పడానికి సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న కాంగ్రెస్.. ఈసారి తెలంగాణలో పాగా వేయలేకపోతే భవిష్యత్తులో ఉనికే ఉండదనే భయంతో గెలుపు పైనే దృష్టి పెట్టింది. బీజేపీ కూడా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ఇక అటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది పోటీ చేశారు. తలపండిన నేతలు, రాజకీయాల్లో తన మార్కును చూపించాలని ఆరాటపడే యువత, ఈసారైనా తమ సత్తా నిరూపించుకోవాలనే మిడిల్ ఏజ్ వాళ్లు.. మహిళలు.. ఇలా ఎంతో మంది ఎన్నికలలో నామినేషన్లు వేశారు. ప్రజా తీర్పుకు తలొగ్గి ప్రజా క్షేత్రంలో నిలబడ్డారు. అయితే ఇప్పటి వరకూ జరిగిన ఏ ఎన్నికలలో ట్రాన్స్‌జెండర్ పోటీ చేయలేదు. ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఒక ట్రాన్స్‌జెండర్ పోటీ చేయబోతున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సారథ్యంలోని బీఎస్పీ .. ఈసారి అన్ని స్థానాల్లోనూ బరిలోకి దిగుతోంది. 43 మంది అభ్యర్థులతో బీఎస్పీ ప్రకటించిన రెండో లిస్టులో.. వరంగల్ తూర్పు స్థానాన్ని చిత్తారపు పుష్పిత లయకు కేటాయించింది. పుష్పితకు సీటు కేటాయించడం టాక్ ఆఫ్ ది తెలంగాణ అయిపోయింది. ఎందుకంటే పుష్పిత.. ట్రాన్స్‌జెండర్ కావడమే. కొన్నాళ్లుగా పుష్పిత బీఎస్పీలో యాక్టివ్‌గా ఉంటున్నారు.
అయితే ఇప్పుడు ఆమెకు టికెట్ రావడంతో ట్రాన్స్‌జెండర్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అటు తనను ఈ ఎన్నికలలో గెలిపిస్తే వరంగల్ తూర్పు నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన మార్కు చూపిస్తానని పుష్పిత అంటున్నారు. విద్యావంతురాలిగా తానేంటో నిరూపించుకుంటానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తనకు టికెట్ కేటాయించడంపై ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు పుష్పిత కృతజ్ఞతలు చెప్తున్నారు.