CM Revanth Reddy : రేవంత్ ప్రమాణస్వీకారానికి చంద్రబాబు! కేసీఆర్‌కు కూడా ఆహ్వానం.. వస్తారా ?
తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, వివిధ రాజకీయ పార్టీల నేతలకు టీపీసీసీ ఆహ్వానాలు పంపింది. ఏపీ సీఎం జగన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్, టీడీపీ అధినేత చంద్రబాబును ఆహ్వానించారు.
తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, వివిధ రాజకీయ పార్టీల నేతలకు టీపీసీసీ ఆహ్వానాలు పంపింది. ఏపీ సీఎం జగన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్, టీడీపీ అధినేత చంద్రబాబును ఆహ్వానించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంకను.. రేవంత్ రెడ్డే ఢిల్లీ వెళ్లి స్వయంగా ఆహ్వానించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఆ రాష్ట్ర మంత్రులకు ఆహ్వానాలు పంపారు. సీనియర్ నేతలు చిదంబరం, అశోక్ గెహ్లాట్, దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, మీరాకుమార్, కుంతియా, భూపేష్ బఘేల్, అశోక్ చవాన్, వాయలార్ రవి, సుశీల్‌కుమార్ శిందే, మాణికం ఠాగూర్, కురియన్‌లను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. వీరితో పాటు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఆహ్వానం పంపారు.
తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, గాదె ఇన్నయ్య, ప్రొఫెసర్ హరగోపాల్, కంచె ఐలయ్యలతో పాటు వివిధ కులసంఘాల నేతలను ఆహ్వానించారు. ఇదంతా ఎలా ఉన్నా.. ప్రమాణస్వీకార కార్యక్రమానికి చంద్రబాబు హాజరవుతారా లేదా అనే చర్చ జరుగుతోంది. టీడీపీ నుంచే రేవంత్ రాజకీయంగా ఎదిగారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కోసం.. ఆయన టీడీపీని పోటీకి దూరంగా ఉంచినట్లు కూడా గుసగుసలు వినిపించాయి. కాంగ్రెస్‌కు లాభం చేకూర్చడానికే పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డి కూడా అనేక మార్లు తనకు రాజకీయ జన్మ నిచ్చిన గురువుగా చంద్రబాబును భావిస్తారు. ఐతే ఏపీలో త్వరలో ఎన్నికల కారణంగా.. ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు రాకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఇక అటు కేసీఆర్ కూడా వచ్చే అవకాశం అసలే లేదు.