చంద్రబాబు శిష్యులే తెలంగాణ ముఖ్యమంత్రులుగా.. ?
రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో ఆరితేరిన వ్యక్తుల్లో చంద్రబాబు ఒకరు. 14 ఏళ్ల సీఎంగా పని చేసిన చంద్రబాబు విజన్‌కు ఇప్పటి వరకూ ఏ నాయకుడు మ్యాచ్ కాలేదు అనడంతో అతిశయోక్తి లేదు. రాష్ట్రం మీద ఆయనకు ఉండే పట్టు.. పరిస్థితిని ఊహించడంతో చూపే చతురత నెవర్ బిఫోర్ అనిపిస్తాయి. ఇక హైదరాబాద్ డెవలప్‌మెంట్ విషయంలో ఆయన విజన్‌ని ప్పటికీ చాలా మంది కొనియాడుతారు. ఆయన ప్రభావం ఇప్పటికీ హైదరాబాద్ ఐటీ ఇండటస్ట్రీ మీద అలాగే ఉంది. ఎన్టీఆర్ అల్లుడిగా వచ్చిన తనకంటూ పొలిటిల్ మార్క్ క్రియేట్ చేసుకున్న చంద్రబాబు రాజకీయాల్లో ట్రెండ్ సెట్టర్ అని చెప్పొచ్చు.

తాను రాజకీయాల్లో ఏలడమే కాకుండా ఎంతో మంది నేతలను కూడా తయారు చేశారు. ఆయన నీడలో పెరిగిన ఎంతో మంది రాజకీయ నేతలు ఇప్పుడు గొప్ప స్థాయిలో ఉన్నారు. నిజంగా చెప్పలంటే తెలంగాణలో ఉన్న చాలా మంది మంత్రులు ఆఖరికి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చంద్రబాబు శిష్యుడే. కేసీఆర్‌ను రాజకీయాల్లోకి తీసుకువచ్చిందే చంద్రబాబు. టీడీపీ నుంచే ఆయన రాజకీయ ప్రవేశం జరిగింది. రెండు టర్ములు తెలంగాణ సీఎంగా పని చేసిన కేసీఆర్.. ఈ ఎన్నికల్లో ఊహించని పరాజయం పొందారు. తెలంగాణ ఓటర్లు ఆయనకు దిమ్మతిరిగే షాకిచ్చి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకు ముందు సీఎంగా ఉన్న కేసీఆర్, ఇప్పుడు సీఎం కాబోతున్న రేవంత్ రెడ్డి.. ఇద్దరూ చంద్రబాబుకు శిష్యులే. రేవంత్ చంద్రబాబు నీడలో పెరిగిన మనిషే. సింపుల్‌గా చెప్పాలంటూ ఓ కొడుకులా రేవంత్‌ను చూసుకున్నారు చంద్రబాబు. రాజకీయంగా సపోర్ట్ ఇచ్చి.. తెలంగాణ సీఎం అయ్యే స్థాయికి తీసుకువచ్చారు. ఇలా చూసుకుంటే చంద్రబాబు శిష్యులే తెలంగాణను ఏలుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్‌గా లేకపోయినా ఈ రాష్ట్రం మీద ఆయన ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది.