Telangana BJP: ఆందోల్‌ బీజేపీలో ఆందోళన.. తండ్రీకొడుకుల లొల్లి ఏంది..?

తనను, తన కొడుకును విడదీయాలని చూస్తున్నారని.. అందుకే పోటీ నుంచి తప్పుకుంటున్నానని.. బీజేపీకి కూడా రాజీనామా చేస్తానని బాబుమోహన్ ప్రకటించారు. దీంతో ఆందోల్‌ విషయంలో తండ్రీకొడుకుల మధ్య ఏదో జరిగింది అన్నది క్లియర్‌గా అర్థం అయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 29, 2023 | 07:45 PMLast Updated on: Oct 29, 2023 | 7:49 PM

Clash Between Babu Mohan And His Son About Andole Assembly Constituency

Telangana BJP: ఆందోల్‌ బీజేపీ శ్రేణులు ఆందోళనలో కనిపిస్తున్నాయ్. తండ్రి అలా.. కొడుకు ఇలా.. ఇప్పుడు ఎలా అని ఎవరికి వారు ప్రశ్నలు గుప్పించుకుంటున్నారు. ఆందోల్‌ బీజేపీ టికెట్ కోసం.. బాబుమోహన్‌తో పాటు ఆయన కుమారుడు ఉదయ్‌ బాబు కూడా పోటీ పడుతున్నారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. దీంతో మీడియా ముందుకు వచ్చి బాబుమోహన్‌.. విరిగిన మనసుతో రకరకాల స్టేట్‌మెంట్లు ఇచ్చారు. లిస్ట్‌లో పేరు ఉన్నా.. తాను బీజేపీ నుంచి పోటీ చేయబోనని.. మాజీ అధ్యక్షుడు, కొత్త అధ్యక్షుడు కూడా తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని.. పార్టీ నుంచి ఎలాంటి సహకారం లేదని చెప్పారు.

తనను, తన కొడుకును విడదీయాలని చూస్తున్నారని.. అందుకే పోటీ నుంచి తప్పుకుంటున్నానని.. బీజేపీకి కూడా రాజీనామా చేస్తానని బాబుమోహన్ ప్రకటించారు. దీంతో ఆందోల్‌ విషయంలో తండ్రీకొడుకుల మధ్య ఏదో జరిగింది అన్నది క్లియర్‌గా అర్థం అయింది. బాబుమోహన్‌ స్టేట్‌మెంట్‌తో ఇక వివాదానికి ఫుల్‌స్టాప్ పడినట్లేనని అంతా అనుకున్నారు. కట్‌ చేస్తే సీన్‌ మాత్రం రివర్స్‌లో కనిపిస్తోంది. బాబుమోహన్ బీజేపీకి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తే.. ఆయన కుమారుడు ఉదయ్‌ బాబు మాత్రం కమలం పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. వాట్సాప్‌లో స్టేటస్‌లు పెడుతున్నారు. బీజేపీని కాపాడుకుందాం అంటూ ఉదయ్ వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకున్నారు. అందరూ కలవాల్సిన సమయం ఆసన్నమైందని.. రామదండు కదలాలి అంటూ స్టేటస్‌లో పెట్టుకున్నాడు. ఐతే తండ్రి అలా.. కొడుకు ఇలా.. ఒకరికి ఒకరు వ్యతిరేక దారుల్లో నడవడం చూసి.. ఆ ఫ్యామిలీ అభిమానులు, బీజేపీ కార్యకర్తలు కన్ఫ్యూజన్‌లో పడిపోయారు.

బీజేపీ ఫస్ట్ లిస్ట్‌లో బాబుమోహన్ పేరు కనిపించలేదు. ఆయన కుమారుడు ఉదయ్‌ పేరును పార్టీ అధిష్టానం పరిశీలిస్తోందని.. అందుకే జాబితాలో అవకాశం రాలేదని పార్టీ వర్గాలు అంటున్నాయ్. నిజానికి రెండు నెలల కింద.. బీజేపీ సీనియర్‌ నాయకుడు జితేందర్‌రెడ్డి.. ఆందోల్‌ టికెట్‌ను ఉదయ్‌బాబుకు ఇద్దామని బాబూమోహన్‌తో అన్నట్లు పార్టీలో చర్చ జరిగింది. అప్పుడు మొదలైన రచ్చ.. ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది.