CM KCR: సేమ్ సెంటిమెంట్.. లక్కీ నెంబర్‌తో ప్రచారం ప్రారంభం..
దేవుళ్లతో పాటు సెంటిమెంట్‌ను కూడా బాగా నమ్మే వ్యక్తి కేసీఆర్. ఆయన ఏం చేసినా దాని వెనక ఏదో ఒక సెంటిమెంట్, ఏదో ఒక నమ్మకం ఉంటుంది. కేసీఆర్‌ను బాగా గమనించే చాలా మందికి ఇది తెలుసు. ఇప్పుడు ఆయన 15 తారీఖునే అభ్యర్థులకు బీఫాంలు ఇవ్వడం, అది కూడా 51 మందికి మాత్రమే బీఫాంలు ఇవ్వడం.
CM KCR: ఎట్టకేలకు బీఆర్‌ఎస్ పార్టీ తన అమ్ములపొది నుంచి అస్త్రాలను బయటికి తీసింది. తెలంగాణలో మరోసారి అధికారంలోకి వస్తే అమలు చేసే సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ ఇవాళ ప్రకటించారు. విద్యార్థులు, మహిళలు, యువతకు పెద్దపీఠ వేస్తూ మేనిఫెస్టో ప్రకటించారు. తెలంగాణపై హామీల వర్షం కురిపించారు. ఇప్పటికే అమలవుతున్న పథకాలను కంటిన్యూ చేస్తూనే కొత్తగా తీసుకురాబోతున్న పథకాలను వివరించారు. 51 మంది బీఆర్‌ఎస్ అభ్యర్థులకు బీఫాంలు ఇచ్చారు. ఇవాళ్టి నుంచే ఎన్నికల ప్రచారాన్ని కూడా మొదలపెట్టారు.
అయితే ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దేవుళ్లతో పాటు సెంటిమెంట్‌ను కూడా బాగా నమ్మే వ్యక్తి కేసీఆర్. ఆయన ఏం చేసినా దాని వెనక ఏదో ఒక సెంటిమెంట్, ఏదో ఒక నమ్మకం ఉంటుంది. కేసీఆర్‌ను బాగా గమనించే చాలా మందికి ఇది తెలుసు. ఇప్పుడు ఆయన 15 తారీఖునే అభ్యర్థులకు బీఫాంలు ఇవ్వడం, అది కూడా 51 మందికి మాత్రమే బీఫాంలు ఇవ్వడం. ఇవాళ్టి నుంచే ఎన్నికల ప్రచారం కూడా మొదలు పెట్టడం వెనక ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ఇవాళ్టి డేట్ 15 తారీఖులోని నెంబర్లను కలిపితే (5+1) 6 నెంబర్ వస్తుంది. బీఫాంలు తీసుకున్న అభ్యర్థులు 51 మంది.. ఆ నెంబర్‌ను 5+1గా కూడినా అదే 6 నెంబర్ వస్తుంది. 6 కేసీఆర్ లక్కీ నెంబర్. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పారు. కేసీఆర్ లక్కీ నెంబర్ కాబట్టే.. 6 నెంబర్ వచ్చేలా డేట్, బీఫాంలను ప్లాన్ చేశారని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు ఆయన అభిమానులు.
ఇక హుస్నాబాద్ నుంచే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టడానికి కూడా ఓ రీజన్ ఉంది. తెలంగాణ వచ్చిన తరువాత ఫేస్ చేసిన మొదటి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని కేసీఆర్ హుస్నాబాద్ నుంచే మొదలు పెట్టారు. ఆ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించారు. ఆ తరువాత 2018లో వచ్చిన ఎన్నికల్లో కూడా హుస్నాబాద్ నుంచే ప్రచారం ప్రారంభించారు. ఆ ఎన్నికల్లో కూడా గెలిచి మరోసారి సీఎం అయ్యారు. అందుకే ఈ ప్లేస్ అంటే సీఎంకు చాలా సెంటిమెంట్. ఈసారి కూడా అదే సెంటిమెంట్‌ను రిపీట్ చేసి.. హ్యాట్రిక్ సీఎం అవ్వాలని కూడా హుస్నాబాద్ నుంచే కేసీఆర్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారని సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం జరుగుతోంది.