BRS కొత్త ఎత్తులు.. ! ముదిరాజ్ వర్గానికి వరాలు.. !!
తెలంగాణలో రాజకీయ గుర్తింపు కోసం గత కొన్ని రోజులుగా ముదిరాజ్ లు చేస్తున్న ఆందోళన ఎట్టకేలకు సీఎం కేసీఆర్ కు కనపడింది.. వినపడింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క టిక్కెట్టు కూడా ముదిరాజ్ లకు ఇవ్వకపోవడంతో కారు పార్టీ మీద ఆ కులస్థులు ఫైర్ అవుతున్నారు. అసలు మాకు ఎందుకు గుర్తింపు ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. ఆ మధ్య సికింద్రాబాద్ లో ఏర్పాటు చేసిన స్టేట్ మీటింగ్ కి.. రాష్ట్రం నలుమూలల నుంచి భారీ ఎత్తున ముదిరాజ్ లు తరలివచ్చారు.
తెలంగాణలో ( Telangana elections ) రాజకీయ గుర్తింపు కోసం గత కొన్ని రోజులుగా ముదిరాజ్ ( Mudirajs ) లు చేస్తున్న ఆందోళన ఎట్టకేలకు సీఎం కేసీఆర్ కు కనపడింది.. వినపడింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క టిక్కెట్టు కూడా ముదిరాజ్ లకు ఇవ్వకపోవడంతో కారు పార్టీ మీద ఆ కులస్థులు ఫైర్ అవుతున్నారు. అసలు మాకు ఎందుకు గుర్తింపు ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. ఆ మధ్య సికింద్రాబాద్ లో ఏర్పాటు చేసిన స్టేట్ మీటింగ్ కి.. రాష్ట్రం నలుమూలల నుంచి భారీ ఎత్తున ముదిరాజ్ లు తరలివచ్చారు. ఆ మీటింగ్ లో బీజేపీ తరపున ఈటల రాజేందర్ పాల్గొనగా.. BRS నుంచి ఎవరూ హాజరు కాలేదు. తెలంగాణలో కీలక సామాజిక వర్గంలో ఉన్న తమకు ఎందుకు టిక్కెట్ ఇవ్వలేదని ముదిరాజ్ కుల నేతలు ప్రశ్నించారు. ఈ సమావేశంతో ఆ వర్గంలో ఈటలకు కాస్త మైలేజ్ వచ్చింది.
Wine Shops Bandh : ఈసీ కీలక నిర్ణయం.. తెలంగాణలో 3 రోజులు వైన్ షాపులు బంద్..!
కేసీఆర్ అప్పటికే దాదాపు సిట్టింగ్స్ MLAలకే మళ్ళీ టిక్కెట్లు ఇవ్వడంతో.. ముదిరాజ్ ల డిమాండ్ కు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఆ వర్గం ఓటర్ల నుంచి డ్యామేజ్ జరిగే అవకాశం ఉండటంతో.. ఆ తర్వాత ముదిరాజ్ లను దగ్గరతీసే ప్రయత్నం చేశారు గులాబీ నేతలు. బిత్తిరి సత్తి క్యారెక్టర్ చేస్తున్న రవికుమార్ పాటు మరికొందరు ముదిరాజ్ కమ్యూనిటీ లీడర్లు తమ పార్టీలో చేర్చుకున్నారు.
తెలంగాణలో టీడీపీ పోటీలో లేకపోవడంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రిజైన్ చేసిన కాసాని జ్ఞానేశ్వర్ ను కూడా బీఆర్ఎస్ చేర్చుకుంది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్.. ముదిరాజ్ లపై వరాల జల్లు కురిపించారు. అసలు తమ పార్టీలో ముదిరాజ్ లో ఎదగకపోవడానికి ఈటల రాజేందర్ కారణమని కొత్త ఆరోపణలు చేశారు. ఎవరికీ అవకాశం రాకుండా.. తానొక్కడే ఎదిగాడన్నారు. అందుకే బండ ప్రకాష్ ను తీసుకొచ్చి.. ఎంపీ, MLC, కౌన్సిల్ పదవులు ఇచ్చినట్టు కేసీఆర్ చెప్పారు..
YS SHARMILA: గురితప్పిన బాణం.. చేతులెత్తేసిన షర్మిల.. తెలంగాణలో పార్టీ ఖేల్ ఖతం..!
అంతేకాదు.. ముదిరాజ్ లకు తమ పార్టీ అండగా ఉంటుందంటూ.. మళ్ళా అధికారంలోకి వచ్చాక రాజ్యసభ, MLC, ఇతర నామినేటెడ్ పోస్టులు ఇస్తామని.. కార్పొరేషన్ మేయర్లు, జడ్పీ, మున్సిపల్ ఛైర్మన్లు.. స్థానిక సంస్థల పదవులు కూడా ముదిరాజ్ వర్గానికి కేటాయిస్తామని భరోసా ఇచ్చారు. మొత్తానికి ఆ వర్గం వారికే అన్ని పదవులూ అంటూ ఊరిస్తున్నారు కేసీఆర్. కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో 70వేల దాకా ముదిరాజ్ ల ఓట్లే ఉన్నాయి. దాంతో బీజేపీ నుంచి అదే కమ్యూనిటీకి చెందిన ఈటల రాజేందర్ అక్కడ పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఓట్లతో పాటు.. కాసాని జ్ఞానేశ్వర్ పలుకుబడితో.. రాష్ట్రంలోని ముదిరాజ్ ల ఓట్లు BRSకు టర్న్ చేయాలన్నది కేసీఆర్ ప్లాన్ గా కనిపిస్తోంది. ఆ వర్గం వాళ్ళ నుంచి అయిన డ్యామేజీని పూడ్చుకునే పనిలో ఉంది BRS పార్టీ.