CM KCR : కోనాయిపల్లి వెంకన్న సన్నిదిలో సీఎం కేసీఆర్.. కేసీఆర్ కి ఎందుకంత సెంటిమెంట్..?

తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల వస్తే చాలా ఆయనకు ఓ సెంటిమెంట్ ఉంటుంది. కేసీఆర్ కు కొంచెం సెంటిమెంట్ అనే ఎక్కువ అనే చెప్పాలి. అది ఎన్నికల సమయంలో అయితే అసల్లు జరిపడేదే లేదు.. సెంటిమెంట్ మాత్రమే ఫాలో అవ్వాల్సిందే. ఇప్పుడు కేసీఆర్ అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు. అదే కోనాయిపల్లి గ్రామంలో ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 4, 2023 | 01:27 PMLast Updated on: Nov 04, 2023 | 1:27 PM

Cm Kcr Performed Special Pooja For Nomination Papers At Konaipalli Venkanna Temple In Siddipet District During Telangana Elections

తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల వస్తే చాలా ఆయనకు ఓ సెంటిమెంట్ ఉంటుంది. కేసీఆర్ కు కొంచెం సెంటిమెంట్ అనే ఎక్కువ అనే చెప్పాలి. అది ఎన్నికల సమయంలో అయితే అసల్లు జరిపడేదే లేదు.. సెంటిమెంట్ మాత్రమే ఫాలో అవ్వాల్సిందే. ఇప్పుడు కేసీఆర్ అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు. అదే కోనాయిపల్లి గ్రామంలో ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయం.

Andhra Pradesh : ఎంపీ విజయ సాయి రెడ్డి VS బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి

ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు పండుగ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన తన ఫామ్ హౌస్ లో మూడు రోజులు రాజాశ్యామల యాగాన్ని నిన్న పూర్ణాహుతితో ముగించారు సీఎం కేసీఆర్. ఇదే తరహాలో సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని కోనాయిపల్లి గ్రామంలో ఉన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించే సెంటి మెంట్ నడుస్తుంది. ఇది ఇప్పటి సెంటిమెంట్ కాదండోయ్.. 1985వ సంవత్సరం నుంచి ఫాలో అవుతున్నారు కేసీఆర్. అప్పటి నుంచి 1989, 1994, 1999, 2001, 2004, 2009, 2018 ప్రతిసారి ఎన్నికల నామినేషన్‌ పత్రాలకు పూజలు నిర్వహించి, నామినేషన్‌ వేసి తన విజయాలను తానే బ్రేక్ చేసుకుంటు ఘన విజయం పొందుతూ వస్తున్నారు కేసీఆర్. 2023లో కూడా ఆ శ్రీనివాసుడి కృపతో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించాలని సంకల్పించారు.

Telangana Assembly Elections: తెలంగాణ ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్‌.. సీటు కేటాయించిన బీఎస్పీ..

ఇక కోనాయిపల్లి వెంకన్న సన్నిదిలో అమృత ఘడియల్లో కేసీఆర్ నామినేషన్ పత్రాలను స్వామి వారి పాదాల ముందు ఉంచి పూజలు చేశారు.తర్వాత ఆలయ ప్రాంగణంలో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని సీఎం కేసీఆర్ కు, హరీష్ రావుకు ఆశీర్వాదాలు ఇచ్చారు ఆలయల పండితులు. ఈ నెల 9న గజ్వేల్, కామారెడ్డిలో సీఎం కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు.

SURESH