CM Revanth : మళ్లీ ఢిల్లీకి సీఎం రేవంత్‌.. కేబినెట్‌లోకి ఆ నలుగురు..

తెలంగాణ సీఎం రేవంత్‌ ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. 19న ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. మంత్రివర్గ విస్తరణ.. నామినేటెడ్ పదవులపైన రేవంత్ హైకమాండ్‌తో చర్చించనున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 18, 2023 | 10:15 AMLast Updated on: Dec 18, 2023 | 10:15 AM

Cm Revanth To Delhi Again Those Four In The Cabinet

తెలంగాణ సీఎం రేవంత్‌ ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. 19న ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. మంత్రివర్గ విస్తరణ.. నామినేటెడ్ పదవులపైన రేవంత్ హైకమాండ్‌తో చర్చించనున్నారు. త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనుండటంతో.. ముందుగా పదవుల పంపిణీ ద్వారా పార్టీలో జోష్ తేవాలని భావిస్తున్నారు. లోక్‌సభ అభ్యర్దుల విషయంలోనూ ఇప్పటికే ఒక జాబితా సిద్దం చేసినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ దక్కేదెవరనే చర్చ మొదలైంది.

ప్రస్తుతం తెలంగాణ కేబినెట్‌లో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అందులో హోం శాఖతో పాటు పలు కీలక శాఖలు ఉన్నాయి. ప్రస్తుత కేబినెట్‌లో నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు. మిగిలి ఉన్న 6 బెర్తుల కోసం దాదాపు డజను మందికిపైగా పోటీ పడుతున్నారు. ఇందులో ఇటీవల ఎన్నికల్లో ఓడిన వారు కూడా ఉన్నారు. ఆరు బెర్తులపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ నుంచి మైనంపల్లి హన్మంతరావు రేసులో ఉన్నప్పటికీ.. లోక్‌ సభ ఎన్నికల్లో మైనంపల్లిని మల్కాజ్‌గిరి నుంచి బరిలో దింపాలని యోచిస్తున్నట్లు సమాచారం. అంజన్‌ కుమార్‌, మధుయాష్కి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ఇద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చి మంత్రి పదవులు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఆదిలాబాద్ నుంచి గడ్డం బ్రదర్స్, ప్రేమ్‌సాగర్ రావు మధ్య పోటీ నడుస్తోంది. నిజామాబాద్ నుంచి షబ్బీర్ అలీ పేరు వినిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ నుంచి మైనంపల్లి హనుమంతరావు పేరు రేసులో ఉన్నా..లోక్ సభ ఎన్నికల్లో మైనంపల్లిని మల్కాజ్ గిరి నుంచి బరిలోకి దింపాలనే ఆలోచన నడుస్తోంది. షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్‌కు మంత్రులుగా అవకాశం ఇచ్చి ఎమ్మెల్సీలుగా ఎంపిక చేస్తారని సమాచారం. చెన్నూరులో గెలిచిన వివేక్, బెల్లంపల్లిలో గెలిచిన వినోద్ కేబినెట్ బెర్త్ కోసం సోనియాను కలిసారు. రేవంత్ తనకు అవకాశం ఇస్తారని వివేక్ నమ్మకంతో ఉన్నారు.