CM Revanth : సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. కేసీఆర్ టీం మొత్తం అవుట్..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పరిపాలనలో మెరుపు వేగంతో మార్పులు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే ప్రజాదర్బార్ ఏర్పాటు, కొత్త పథకాల అమలు కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న సలహాదారులను తొలగించాలని ఆదేశించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పరిపాలనలో మెరుపు వేగంతో మార్పులు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే ప్రజాదర్బార్ ఏర్పాటు, కొత్త పథకాల అమలు కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న సలహాదారులను తొలగించాలని ఆదేశించారు. ఈ మేరకు చీఫ్ సెక్రెటరీ శాంతి కుమారి.. ప్రభుత్వ సలహాదారుల నియామకాలు రద్దు చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 12 మంది రిటైర్డ్ అధికారులు ప్రభుత్వ సలహాదారులుగా కొనసాగారు. సీఎం ముఖ్య సలహాదారుగా మాజీ సీఎస్ సోమేశ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా రాజీవ్ శర్మ కొనసాగుతున్నారు. మరో మాజీ సీఎస్ ఎస్.కె. జోషి ప్రస్తుతం ఇరిగేషన్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నారు. 2012లో రిటైర్ అయిన కె.వి.రమణాచారి ప్రభుత్వ అడ్వయిర్ గా పని చేశారు. పీసీసీఎఫ్ హోదాలో పదవీ విరమణ పొందిన శోభను అదే రోజున అడ్వైజర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Revanth Reddy : రేవంత్ పై ప్రతిపక్షాలు.. యుద్ధం మొదలెట్టేశాయా.. ?
మాజీ డీజీపీ అనురాగ్ శర్మ, రిటైర్డ్ ఐపీఎస్ ఏ.కే.ఖాన్ కూడా సలహాదారులుగా ఉన్నారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో జీఆర్ రెడ్డి, శివశంకర్ స్పెషల్ ఆఫీసర్లుగా ఉన్నారు. ఆర్ అండ్ బీకి సుధాకర్ తేజ, ఎనర్జీ సెక్టార్‌కు రాజేంద్ర ప్రసాద్ సింగ్, హార్టికల్చర్‌కు శ్రీనివాస్ రావు అడ్వైజర్‌గా ఉన్నారు. ఇప్పుడు వీరంతా ఇంటిబాట పట్టనున్నారు. సెక్రటేరియెట్‌లో మంత్రుల చాంబర్ల దగ్గర ఉన్న వారి నేమ్ ప్లేట్లను అధికారులు తొలగించారు. ఆరో ఫ్లోర్‌లోని సీఎం ఆఫీసులో కేసీఆర్ నేమ్ ప్లేట్ తీసేశారు. ఆయా చాంబర్లలో ఉన్న సీఎం సెక్రటరీలు, పీఎస్‌లు, ఓఎస్డీల నేమ్ ప్లేట్లు తొలగించి.. క్యాబిన్లను కొత్తగా రెడీ చేస్తున్నారు. మరోవైపు పలు కార్పొరేషన్ల చైర్మన్లు కూడా ఇప్పటికే రాజీనామా చేశారు. వీరి స్థానంలో కొత్త ప్రభుత్వ సలహదారులను త్వరలోనే నియమించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి.