Congress, CLP : ముగిసిన సీఎల్పీ సమావేశం.. CLP నేత ఎంపికను.. ఏఐసీసీ అప్పగించిన కాంగ్రెస్
కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశం ముగిసింది. గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో ఆ పార్టీ ఎమ్మెల్యేలతో ఏఐసీసీ సమావేశమయ్యారు. సీఎల్పీ నేత ఎంపికకు ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించారు. ఏకవాక్య తీర్మానం ను ప్రవేశపెట్టిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.
కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశం ముగిసింది. గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో ఆ పార్టీ ఎమ్మెల్యేలతో ఏఐసీసీ సమావేశమయ్యారు. సీఎల్పీ నేత ఎంపికకు ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించారు. ఏకవాక్య తీర్మానం ను ప్రవేశపెట్టిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. సమావేశం ముగియడంతో.. ఎమ్మెల్యేల అభిప్రాయాలతో కూడిన నివేదికను అధిష్ఠానంలో ఉన్న ఖర్గేకు పంపనున్నారు. ఆ తర్వాత సీఎల్పీ నేత ఎంపికపై కాంగ్రెస్ ఏఐసీసీ పెద్దలు నిర్ణయం తీసుకోనున్నారు. CLP ఎంపీకపై మరో రెండు గంటల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
మెదక్ లో కుప్పకూలిన దుండిగల్ విమానం.. ట్రైనర్ తో సహా కి పైలెట్ సజీవ దహనం..
మరోవైపు సీఎల్పీ సమావేశానికి ముందు కాంగ్రెస్ ముఖ్యనేతలతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ భేటీ అయ్యారు. పార్క్‌హయత్ హోటల్‌లో కాంగ్రెస్ సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి సోదరులతో వివిధ అంశాలపై డీకే చర్చలు జరిపారు. సీఎల్పీ నేత ఎంపిక తర్వాత గవర్నర్ ను కలవనున్నారు. ఇక కాంగ్రెస్ లో ఎవరు సీఎం అవుతారు అన్న ప్రశ్నకు.. సరైన సమాధానం ఇంక రాలేదు. ఈ విషయం కూడా ఏఐసీసీ పెద్దలకు అప్పగించినట్లు సమాచారం.