CONGRESS: కమ్యూనిస్టులతో కాంగ్రెస్ పొత్తు.. సీపీఎం, సీపీఐకి చెరో నాలుగు స్థానాలు..?
మ్యూనిస్టులకు కూడా కొన్ని సీట్లు కేటాయించబోతుంది. సీపీఎంకు రెండు సీట్లు, సీపీఐకి రెండు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీ అయింది. సీపీఐకి ఇవ్వబోయే రెండు సీట్లపై ఇప్పటికే ఒక స్పష‌్టత వచ్చింది. పొత్తులో భాగంగా చెన్నూరు, కొత్తగూడెం స్థానాల్ని సీపీఐకి ఇవ్వబోతుంది.
CONGRESS: తెలంగాణ కాంగ్రెస్ ఆదివారం 55 మంది పేర్లతో కూడిన తొలి జాబితాను ప్రకటించింది. మిగతా నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. అయితే, కాంగ్రెస్ 119 నియోజకవర్గాల్లో పోటీ చేయడం లేదని తెలుస్తోంది. కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దీని ప్రకారం.. కమ్యూనిస్టులకు కూడా కొన్ని సీట్లు కేటాయించబోతుంది. సీపీఎంకు రెండు సీట్లు, సీపీఐకి రెండు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీ అయింది. సీపీఐకి ఇవ్వబోయే రెండు సీట్లపై ఇప్పటికే ఒక స్పష‌్టత వచ్చింది. పొత్తులో భాగంగా చెన్నూరు, కొత్తగూడెం స్థానాల్ని సీపీఐకి ఇవ్వబోతుంది. అలాగే సీపీఎంకు ఇవ్వబోయే సీట్లపై ఆ పార్టీతో చర్చలు జరుగుతున్నాయి.
దీంతో రాబోయే ఎన్నికల్లో కమ్యూనిస్టులు, కాంగ్రెస్.. కలిసి పోటీ చేయడం ఖాయమే. అయితే, కమ్యూనిస్టులు అడిగిన అన్ని సీట్లకు కాంగ్రెస్ పచ్చజెండా ఊపలేదు. కమ్యూనిస్టులు భద్రాచలం టిక్కెట్ కావాలని అడిగాయి. కానీ, అక్కడ కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని కమ్యూనిస్టులకు టిక్కెట్ ఇచ్చే పరిస్థితి లేదని కాంగ్రెస్ తేల్చిచెప్పింది. దీంతో ఆ సీటును కమ్యూనిస్టులు వదిలేసుకున్నాయి. ఆ సీటును పోదెం వీరయ్యకే కేటాయించింది కాంగ్రెస్. పాలేరు, మునుగోడు, ఖమ్మం సీట్లు కావాలని కూడా వామపక్షాలు పట్టుబడుతున్నాయి. అయితే, ఖమ్మం నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పోటీ చేయాలనుకుంటున్నారు. కానీ, వీరికి మొదటి జాబితాలో చోటు దక్కకపోవడం విశేషం. ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయి. మిగతా సీట్ల విషయంలో కమ్యూనిస్టులతో ప్రస్తుతం కాంగ్రెస్ చర్చలు జరుపుతోంది. ఒకట్రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుంది. కాంగ్రెస్ రెండో జాబితా మరో నాలుగు రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. బుధ లేదా గురువారాల్లో తుది జాబితా వస్తుందని తెలుస్తోంది.
ఒక కుటుంబానికి ఒకటే టిక్కెట్ అని చాలా కాలం నుంచి చెబుతూ వస్తున్న కాంగ్రెస్.. తాజా జాబితాలో మైనంపల్లి కుటుంబానికి రెండు టిక్కెట్లు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబానికి రెండు టిక్కెట్లు ఇవ్వడం విశేషం. మరికొందరు నేతలు కూడా తమ కుటుంబం నుంచి రెండు టిక్కెట్లు ఆశిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం కాంగ్రెస్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. తెలంగాణలోనే కాకుండా.. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కూడా ఆయా పీసీసీలు ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను వెల్లడించాయి.