Malla Reddy: మంత్రి మల్లారెడ్డిపై చార్జిషీట్.. అఫిడవిట్‌లో తప్పులు.. మూడు కాలేజీల్లో ఇంటర్..

2014లో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేసినప్పుడు మల్లారెడ్డి ఇచ్చిన అఫిడవిట్‌లో సికింద్రాబాద్ ప్యాట్నీలోని గవర్నమెంట్ కాలేజీ నుంచి 1973లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణుడైనట్టు పేర్కొన్నారు. 2018లో ఇచ్చిన అఫిడవిట్‌లో సికింద్రాబాద్‌లోని వెస్లి జూనియర్ కాలేజ్ నుంచి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణుడైనట్టు పేర్కొన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 14, 2023 | 01:59 PMLast Updated on: Nov 14, 2023 | 2:34 PM

Congress Charge Sheet On Minister Malla Reddy

Malla Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మంత్రి మల్లారెడ్డి (Malla Reddy)పై కాంగ్రెస్ (CONGRESS) నాయకులు చార్జిషీట్ విడుదల చేశారు. ఆయన ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లలో తప్పులున్నట్లు కాంగ్రెస్ వెల్లడించింది. అంతేకాదు.. ఆయన ఆదాయాలు, అక్రమాల్ని కూడా బయటపెట్టింది. ఐటీ శాఖ, మీడియా సాక్ష్యాల ఆధారంగా ఈ చార్జిషీటు (CHARGE SHEET) విడుదలైంది. కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఈ చార్జిషీటును మీడియాకు అందించారు.

ఇంటర్మీడియట్ మూడు సార్లు.. మూడు కాలేజీల్లో..

“2014లో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేసినప్పుడు మల్లారెడ్డి ఇచ్చిన అఫిడవిట్‌లో సికింద్రాబాద్ ప్యాట్నీలోని గవర్నమెంట్ కాలేజీ నుంచి 1973లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణుడైనట్టు పేర్కొన్నారు. 2018లో ఇచ్చిన అఫిడవిట్‌లో సికింద్రాబాద్‌లోని వెస్లి జూనియర్ కాలేజ్ నుంచి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణుడైనట్టు పేర్కొన్నారు. తాజాగా 2023లో ఇచ్చిన అఫడవిట్‌లో రాఘవ లక్ష్మిదేవి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నుంచి ఇంటర్మీడియట్ పాస్ అయినట్టు పేర్కొన్నారు. దొంగ చదువుల మంత్రి మల్లారెడ్డి.. కుటుంబ యాజమాన్యంలోని మల్లారెడ్డి విద్యాసంస్థల్లో అక్రమాలు గుర్తించామంటున్నారు ఐటీ అధికారులు. ఆయన విద్యాసంస్థల్లో అక్రమాలపై నిర్థారణకు వచ్చినట్లు ఐటీ శాఖ ఇదివరకే తెలిపింది. నిర్దేశిత ఫీజుల కంటే అదనంగా వసూలు చేసినట్లు ఐటీ శాఖ నిర్ధారించింది. వసూలు చేసిన ఫీజులను, అనధికార వసూళ్లను రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టినట్లుగా గుర్తించారు.

PAWAN KALYAN: ఈసారి పవన్ సీటు ఎక్కడ..? ఇప్పుడు వెతుక్కోకపోతే అప్పుడు కష్టం !

పెద్ద మొత్తంలో బ్లాక్‌లో నగదును ఉంచుతున్నట్లు ఐటీ అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. నగదును నారాయణ ఆసుపత్రికి తరలించినట్లుగా ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ తన కథనంలో పేర్కొంది. వసూలు చేసిన మొత్తాన్ని మల్లారెడ్డి-నారాయణ ఆసుపత్రి నిర్మాణానికి వెచ్చించినట్లుగా ఆధారాలు సేకరించినట్లు ఐటీ అధికారులు పేర్కొన్నారు. అలాగే స్థిరాస్తులను కూడా అసలు విలువకు తగ్గించి చూపినట్లు వారు తెలిపారు. ఇదే సమయంలో మంత్రి మల్లారెడ్డి వియ్యంకుడు వర్థమాన్ కళాశాలలో డైరెక్టర్‌గా వుండటంతో అక్కడ కూడా సోదాలు నిర్వహించారు. మొత్తంగా మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో ఇప్పటి వరకు రూ.6 కోట్ల నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్లుగా ఐటీ అధికారులు వెల్లడించారు. మల్లారెడ్డి గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారిని బెదిరించిన ఆడియో కూడా బయటకు వచ్చింది.

మల్లారెడ్డి యూనివర్శిటీ ఉన్న గుండ్లపోచంపల్లి గ్రామ పరిధిలో 1965 పహాణీలో సర్వే నెం 650లో 22 ఏకరాల 8 గుంటలు ఉన్నట్లు ఉంది, అదే విధంగా 2000-01 పహాణీలో కూడా 22 ఎకరాల 8 గుంటలుగా ఉంది. అయితే ఆతరువాత ఏమి జరిగిందో ఏమో గానీ ధరణి పోర్టల్‌లో 560 సర్వే నెంబర్‌లో 33 ఎకరాల 20 గుంటలు అయ్యింది. అది ఎలా సాధ్యమైందో. ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఇదే భూమిలో గ్రామ పంచాయతీ అనుమతితో 2004 సంవత్సరంలో లేఅ వుట్ అనుమతులు తీసుకుని విక్రయాలు సాగించారనీ, ఆ తరువాత 2015లో హెచ్ఎండీఏ లే అవుట్ తీసుకుని విక్రయాలు సాగించారు.

MLA Sitakka : సీతక్కను ఓడించేందుకు 200 కోట్లు !?

మరో పక్క మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల నాక్ గుర్తింపు కోసం తప్పుడు దృవీకరణ పత్రాలు సమర్పించారన్న అభియోగంపై నాక్ అయిదేళ్ల పాటు నిషేదం విధించింది. అయితే, కేసిఆర్ సర్కార్ యూనివర్శిటీకి అనుమతి ఇచ్చింది. ఇటువంటి నాయకుడిని పక్కన పెట్టుకుని కేసిఆర్, కేటిఆర్ నీతి గురించి, నిజాయతీ గురించి మాట్లాడుతున్నారు” అంటూ బక్క జడ్సన్ విమర్శించారు.