Deeksha Divas: దీక్షా దివస్‌లో పాల్గొన్న కేటీఆర్.. ఫిర్యాదు చేసిన కాంగ్రెస్‌.. స్పందించిన ఈసీ..

ఈసారి ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఎన్నికల నియమావళి అడ్డొచ్చింది. నిబంధనల ప్రకారం దీక్షా దివస్ జరపడానికి వీల్లేదు. కానీ, కేటీఆర్.. ఈ నిబంధన ఉల్లంఘించారు. రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉన్న ఈ సమయంలో, హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన దీక్షా దివస్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 29, 2023 | 07:17 PMLast Updated on: Jan 23, 2024 | 1:30 PM

Congress Complained To Ec About Brs Deeksha Diwas

Deeksha Divas: తెలంగాణ ఎన్నికలకు మరికొన్ని గంటలే సమయం ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఎన్నికల కోడ్ కచ్చితంగా అమలవుతుంది. అలాంటిది అధికార పార్టీకి చెందిన మంత్రి కేటీఆర్.. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కాంగ్రెస్ అంటోంది. నిబంధనలకు విరుద్ధంగా దీక్షా దివస్‌లో పాల్గొనడం ద్వారా కేటీఆర్.. రూల్స్ అతిక్రమించారని కాంగ్రెస్.. ఈసీకి ఫిర్యాదు చేసింది. మంత్రి కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని కోరింది. నవంబర్ 29న ప్రతి ఏటా దీక్షా దివస్ నిర్వహించడం ఆనవాయితీ. 2009న, ఇదే రోజు కేసీఆర్.. తెలంగాణ కోసం దీక్ష ప్రారంభించారు.

KTR BLOOD DONATION: కేటీఆర్ డయాబెటిస్ పేషెంట్ ! మరి రక్తదానం చేయొచ్చా?

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ శ్రేణులు దీక్షా దివస్ జరుపుతాయి. అయితే, ఈసారి ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఎన్నికల నియమావళి అడ్డొచ్చింది. నిబంధనల ప్రకారం దీక్షా దివస్ జరపడానికి వీల్లేదు. కానీ, కేటీఆర్.. ఈ నిబంధన ఉల్లంఘించారు. రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉన్న ఈ సమయంలో, హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన దీక్షా దివస్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. బుధవారం ఆయన రక్తదానం కూడా చేశారు. ఈ తరుణంలో దీక్షా దివాస్ నిర్వహించడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుందని, దీన్ని వెంటనే నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఎన్నికలకు ఒకరోజు ముందు ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం సరికాదని ఈసీకి ఫిర్యాదు చేసింది.

కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని కోరింది. కాంగ్రెస్ ఫిర్యాదుతో తెలంగాణ భవన్‌కు ఎన్నికల కమిషన్‌ స్వ్కాడ్‌ టీమ్‌ చేరుకుంది. కార్యక్రమం నిలిపివేయాలని కోరింది. అయితే, ఇది కొత్త కార్యక్రమం కాదని, ప్రతి ఏడాది జరుగుతున్న కార్యక్రమం అని బీఆర్‌ఎస్‌ నేతలు, లీగల్‌ టీమ్‌ ఈసీ అధికారులకు సూచించారు. దీంతో.. ఈ కార్యక్రమాన్ని బహిరంగంగా కాకుండా తెలంగాణ భవన్‌ లోపల నిర్వహించుకోవాలని బీఆర్ఎస్ నేతలకు సూచించింది. దీంతో తెలంగాణ భవన్‌ లోపలే బీఆర్‌ఎస్‌ నేతలు ఈ కార్యక్రమం నిర్వహించారు.