Bandi Sanjay : బండి సంజయ్‌కు ప్రత్యర్థిని రెడీ చేసిన కాంగ్రెస్‌!

అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు పార్లమెంట్‌ ఎన్నికల మీద దృష్టిసారించింది. ఇంకొన్ి నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయ్. ఆ ఎలక్షన్స్‌లో మెజారిటీ స్థానాలను తమ ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో కనిపిస్తోంది కాంగ్రెస్‌.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 16, 2023 | 06:17 PMLast Updated on: Dec 16, 2023 | 6:17 PM

Congress Has Prepared An Opponent For Bandi Sanjay

అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు పార్లమెంట్‌ ఎన్నికల మీద దృష్టిసారించింది. ఇంకొన్ి నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయ్. ఆ ఎలక్షన్స్‌లో మెజారిటీ స్థానాలను తమ ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో కనిపిస్తోంది కాంగ్రెస్‌. దీనిలో భాగంగా అన్ని పార్లమెంట్ స్థానాల్లోనూ బలమైన అభ్యర్థులను పోటీకి దించేందుకు కసరత్తు మొదలు పెట్టింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వీలైనంత ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచి మరోసారి బీఆర్ఎస్ , బీజేపీలకు అవకాశం లేకుండా చేయాలనే పట్టుదలతో ఉంది. బీజేపీ, బీఆర్ఎస్‌ నుంచి పోటీకి దిగబోతున్న కీలక నేతలను టార్గెట్‌ చేసుసకొని.. ఆయా నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను పోటీకి దింపేందుకు వేట మొదలు పెట్టింది.

ముఖ్యంగా తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను లక్ష్యంగా చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్‌ నుంచి పోటీ చేసిన ఆయన.. ఓటమి పాలయ్యారు. మళ్లీ కరీంనగర్‌ నుంచి పార్లమెంట్‌ ఫైట్‌కు సిద్ధం అవుతున్నారు. దీంతో ఆ స్థానంలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిని పోటీకి దించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి జీవన్ రెడ్డి ఓటమి చెందారు. ఐతే ఆయన ఓడినా, కాంగ్రెస్ పరపతి పెంచే విధంగా వ్యవహరిస్తుండడం.. ప్రత్యర్థుల విమర్శలను తిప్పుకొడుతూ యాక్టివ్‌గా ఉండడంతో కరీంనగర్ ఎంపీగా జీవన్ రెడ్డిని పోటీకి దించాలని కాంగ్రెస్ భావిస్తోందట. అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీ స్థానం పరిధిలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో జీవన్ రెడ్డిని ఇక్కడ నుంచి పోటీకి దింపితే ఫలితం ఆశాజనకంగా ఉంటుందని హస్తం పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. దీనికితోడు ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గెలిచిన ఎమ్మెల్యేలంతా జీవన్ రెడ్డిని పోటీకి దించాలని కోరుతున్నారు. దీంతో హస్తం పార్టీ పెద్దలు ఆయన వైపే మొగ్గు చూపుతున్నారు. ఇక అటు బీఆర్ఎస్‌ నుంచి మళ్లీ వినోద్‌ కుమార్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.