Telangana Congress : కాంగ్రెస్ తొలి జాబితా విడుదల.. 55 స్థానాలకు అభ్యర్థులను ఖరారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల కాంగ్రెస్ తొలి జాబితా విడుదల చేసింది. ఇందులో మొదటి విడతగా 55 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. వీరిలో ఒకే కుటుంబానికి రెండేసి సీట్లు కేటాయించింది కాంగ్రెస్. అందులో మైనంపల్లి కుటుంబం, ఉత్తమ్ కుటుంబానికి రెండు సీట్లు ఖరారు.. 

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 15, 2023 | 10:11 AMLast Updated on: Oct 15, 2023 | 10:20 AM

Congress Has Released The First List Of Candidates For The Telangana Assembly Elections In The First Phase The Congress Leadership Has Finalized The Candidates For 55 Seats

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల కాంగ్రెస్ తొలి జాబితా విడుదల చేసింది. ఇందులో మొదటి విడతగా 55 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. వీరిలో ఒకే కుటుంబానికి రెండేసి సీట్లు కేటాయించింది కాంగ్రెస్. అందులో మైనంపల్లి కుటుంబం, ఉత్తమ్ కుటుంబానికి రెండు సీట్లు ఖరారు..  ఇటీవల కొత్తగా పార్టీలో చేరిన మాజీ ఎంపీ పొంగులేటీ శ్రీనివాస రెడ్డి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు పేర్లను తొలి జాబితా లో విడుదల చేయలేదు. కానీ కొడుకు సీటు కోసం బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన మైనంపల్లి హనుమంతు, వారి కుమారుడు రోహిత్ రెడ్డికి టికెట్ కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం.

కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా:

బెల్లంపల్లి – గడ్డం వినోద్‌ (ఎస్సీ)

మంచిర్యాల – ప్రేమ్‌సాగర్‌ రావు

నిర్మల్‌ – శ్రీహరి రావు

ఆర్మూర్‌ – ప్రొద్దుటూరి వినయ్‌ కుమార్‌ రెడ్డి

బోధన్‌ – సుదర్శన్‌ రెడ్డి

బాల్కొండ – సునీల్‌ కుమార్‌ ముత్యాల

జగిత్యాల – జీవన్‌ రెడ్డి

ధర్మపురి – లక్ష్మణ్‌ కుమార్‌ (ఎస్సీ)

రామగుండం – రాజ్‌ థరూర్‌

మంథని – దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు

పెద్దపల్లి – చింతకుంట విజయ్‌ రమణారావు

వేములవాడ – ఆది శ్రీనివాస్‌

మానకొండూరు – కవ్వంపల్లి సత్యనారాయణ (ఎస్సీ)

మెదక్‌ – మైనంపల్లి రోహిత్‌ రావు

అందోల్‌ – దామోదర రాజనర్సింహ (ఎస్సీ)

జహీరాబాద్‌ – ఆగం చంద్రశేఖర్‌ (ఎస్సీ)

సంగారెడ్డి – జగ్గారెడ్డి

గజ్వేల్‌ – తూముకుంట నర్సారెడ్డి

మేడ్చల్‌ – తోటకూర వజ్రేశ్‌ యాదవ్‌

మల్కాజిగిరి – మైనంపల్లి హన్మంతరావు

కుత్బుల్లాపూర్ – కొలన్‌ హన్మంత్‌ రెడ్డి

ఉప్పల్‌ – పరమేశ్వర్‌ రెడ్డి

చెవేళ్ల – భీమ్‌భరత్‌ (ఎస్సీ)

పరిగి – టి. రామ్మోహన్‌ రెడ్డి

వికారాబాద్‌ – గడ్డం ప్రసాద్‌ కుమార్‌

ముషీరాబాద్‌ – అంజన్‌కుమార్‌ యాదవ్‌

మలక్‌పేట – షేక్‌ అక్బర్‌

సనత్‌నగర్‌ – కోట నీలిమ

నాంపల్లి – ఫిరోజ్‌ ఖాన్‌

కార్వాన్‌ – ఉస్మాన్‌ బిన్‌ మహ్మద్‌ అల్‌హజ్రి

గోషామహల్‌ – మొగిలి సునీత

చాంద్రయణగుట్ట – బోయ నగేశ్‌

యాకత్‌పుర – కె. రవి రాజు

బహదూర్‌పుర – రాజేశ్‌ కుమార్‌ పులిపాటి

సికింద్రాబాద్‌ – ఎ.సంతోష్‌ కుమార్‌

కొడంగల్‌ – రేవంత్‌ రెడ్డి

గద్వాల – సరితా తిరుపతయ్య

అలంపూర్‌ – సంపత్‌ కుమార్‌ (ఎస్సీ)

నాగర్‌కర్నూల్‌ – కె. రాజేశ్‌ రెడ్డి

అచ్చంపేట్‌ – సీహెచ్‌ వంశీకృష్ణ (ఎస్సీ)

కల్వకుర్తి – కసిరెడ్డి నారాయణ్‌ రెడ్డి

షాద్‌ నగర్‌ – కె. శంకరయ్య

కొల్లాపూర్‌ – జూపల్లి కృష్ణారావు

నాగార్జున సాగర్‌ – కుందూరు జయవీర్‌

హుజూర్‌ నగర్‌ – ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

కోదాడ – పద్మావతి రెడ్డి

నల్గొండ- కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నకిరేకల్‌ – వేముల వీరేశం (ఎస్సీ)

ఆలేరు – బీర్ల ఐలయ్య

స్టేషన్‌ ఘన్‌పూర్‌ – సింగాపురం ఇందిర (ఎస్సీ)

నర్సంపేట – దొంతి మాధవ్‌ రెడ్డి

భూపాలపల్లి – గండ్ర సత్యనారాయణ రావు

ములుగు – సీతక్క (ఎస్టీ)

మధిర – మల్లు భట్టి విక్రమార్క (ఎస్సీ)

భద్రాచలం – పొదెం వీరయ్య

S.SURESH