CONGRESS: కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ ఫైనల్‌.. వాళ్లతోనే అసలు ఇబ్బందంతా..

ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్లుగా కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ పరిస్థితి కనిపిస్తోంది. లిస్ట్ అనౌన్స్‌మెంట్‌ వరుసగా వాయిదా పడుతూనే ఉంది. లెఫ్ట్‌ పార్టీలతో కాంగ్రెస్‌ పొత్తు ఫైనల్ అయినా.. సీట్ల సర్దుబాటు కొలిక్కి రావడం లేదు. లెఫ్ట్ పార్టీలకు ఇచ్చే సీట్లపై స్క్రీనింగ్ కమిటీ చర్చించినా.. ఏకాభిప్రాయం కుదరలేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయ్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 23, 2023 | 02:51 PMLast Updated on: Oct 23, 2023 | 2:51 PM

Congress Second List Is Ready Will Release Soon

CONGRESS: తెలంగాణలో ఎన్నికల వేడి మాములుగా లేదు. పార్టీలన్నీ దూకుడు పెంచాయ్. దాదాపు అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించేసినట్లే ఒకరకంగా! బీఆర్ఎస్‌ దాదాపు అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తే.. బీజేపీ, కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ అనౌన్స్‌ చేశాయ్. అటు కమలం పార్టీ, ఇటు కాంగ్రెస్‌.. రెండు పార్టీల్లో ఫస్ట్ లిస్ట్ రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. రెండు పార్టీల లిస్ట్‌లో.. సీనియర్లు కనిపించలేదు పెద్దగా..! బీజేపీ సంగతి ఎలా ఉన్నా.. ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్లుగా కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ పరిస్థితి కనిపిస్తోంది.

లిస్ట్ అనౌన్స్‌మెంట్‌ వరుసగా వాయిదా పడుతూనే ఉంది. లెఫ్ట్‌ పార్టీలతో కాంగ్రెస్‌ పొత్తు ఫైనల్ అయినా.. సీట్ల సర్దుబాటు కొలిక్కి రావడం లేదు. లెఫ్ట్ పార్టీలకు ఇచ్చే సీట్లపై స్క్రీనింగ్ కమిటీ చర్చించినా.. ఏకాభిప్రాయం కుదరలేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయ్. ఐతే అటు రెండో జాబితాపై స్క్రీనింగ్ కమిటీ కసరత్తు ఫైనల్ స్టేజ్‌కు చేరింది. ఢిల్లీలో వరుసగా రెండు రోజులు సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ.. అభ్యర్థుల ఎంపికపై చర్చించింది. మొదటి జాబితాలో 55 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌.. మిగిలిన 64 నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేసింది. ఇప్పటివరకూ 35 నుంచి 40 నియోజకవర్గాలపై ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. ఈనెల 25న కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. అదే రోజు కాంగ్రెస్‌ తన రెండో లిస్టు రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఇక అటు పొత్తులో భాగంగా సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు.. సీపీఎంకు మిర్యాలగూడ, వైరా సీట్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. ఐతే వైరా బదులు పాలేరు సీటు కోసం సీపీఎం పట్టుబడుతున్నట్లు సమాచారం. పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీకి సిద్ధం అయ్యారు. దీంతో పాలేరు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఒప్పుకోవడం లేదు. వైరాతో సరిపెట్టుకోవాలని సీపీఎం నేతలను ఒప్పించేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వం లెఫ్ట్‌ పార్టీలతో కూర్చొని చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. లెఫ్ట్ పార్టీలతో సయోధ్య కుదిరితే సెకండ్ లిస్ట్ మీద మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.