Telangana Congress: కాంగ్రెస్‌కు భారీ షాక్.. కారెక్కిన కీలక నేత..
జడ్చర్ల స్థానం నుంచి అనిరుధ్ రెడ్డికి టికెట్ కేటాయించింది కాంగ్రెస్. దీంతో అసంతృప్తికి గురైన ఎర్ర శేఖర్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. కాంగ్రెస్‌లో చేరడానికి ముందు ఎర్ర శేఖర్ బీజేపీలో ఉన్నారు. కమలం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
Telangana Congress: సెకండ్ లిస్ట్.. కాంగ్రెస్‌లో రేపుతున్న ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు. టికెట్ రాలేదన్న కోపంతో అసంతృప్త నేతలు రేవంత్‌కు ఎదురుతిరుగుతున్నారు. టికెట్ ఆశించి భంగపడిన జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్.. హస్తం పార్టీకి షాక్ ఇచ్చారు. కేటీఆర్ సమక్షంలో కారెక్కేశారు. జడ్చర్ల నుంచి శేఖర్ టికెట్ ఆశించారు. ఐతే ఎర్ర శేఖర్‌కు కాంగ్రెస్ టికెట్ దక్కలేదు. జడ్చర్ల అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరఫున ఎర్ర శేఖర్ మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
ఆ తర్వాత పరిణామాలతో కాంగ్రెస్‌లో చేరగా.. ఆయనకు టికెట్ దక్కలేదు. జడ్చర్ల స్థానం నుంచి అనిరుధ్ రెడ్డికి టికెట్ కేటాయించింది కాంగ్రెస్. దీంతో అసంతృప్తికి గురైన ఎర్ర శేఖర్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. కాంగ్రెస్‌లో చేరడానికి ముందు ఎర్ర శేఖర్ బీజేపీలో ఉన్నారు. కమలం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. బీజేపీలో స్థానికంగా ఉన్న పరిస్థితులతో బీజేపీకి గుడ్ బై చెప్పారు ఎర్ర శేఖర్. బీజేపీలో చేరడానికి ముందు టీడీపీలో ఉన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు గణనీయంగా ఉంటారు. ఎర్ర శేఖర్ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర, నారాయణపేట, జడ్చర్ల, నాగర్ కర్నూల్, గద్వాల వంటి అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ టికెట్ ఆశించిన కొందరు నేతలు అసంతృప్తితో పార్టీ మారే ప్రయత్నం చేస్తున్నారు. టికెట్ దక్కని నేతలు తమ అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ ఎన్నికల్లో ఈ దఫా అధికారాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహ రచన చేస్తుంది. మూడో దఫా తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని బీఆర్ఎస్ పావులు కదుపుతుంది. తెలంగాణలో తొలిసారిగా అధికారాన్ని దక్కించకోవాలని బీజేపీ వ్యూహలు రచిస్తోంది. ఎన్నికల వేళ ఎర్రశేఖర్ పార్టీ మారడం అంటే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ప్రభావం పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్.