ఇలా జరుగుతుందని అనుకోలేదు.. ట్విట్టర్ సాక్షిగా కేటీఆర్ ఎమోషనల్‌..

తెలంగాణ రిజల్ట్‌ డిసైడ్‌ అయ్యింది. ఆఖరికి ఎగ్జిట్‌ పోల్సే నిజమయ్యాయి. భారీ ఆధిక్యంతో దిశగా కాంగ్రెస్‌ పార్టీ దూసుకుపోతోంది. ఇప్పుడు కాంగ్రెస్‌ను బీట్‌ చేయడం కాదు కదా రీచ్‌ అవ్వడం కూడా బీఆర్‌ఎస్‌ పార్టీకి కష్టంగానే మారింది. నిజానికి ఉదయం పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపుతోనే రిజల్ట్‌లో ఓ క్లారిటీ వచ్చింది. ఉదయం నుంచి కాంగ్రెస్‌ మెజార్టీ పెరుగుతూనే ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 3, 2023 | 06:15 PMLast Updated on: Dec 03, 2023 | 6:15 PM

Didnt Think This Would Happen Ktr Is Emotional As Twitter Witness

తెలంగాణ రిజల్ట్‌ డిసైడ్‌ అయ్యింది. ఆఖరికి ఎగ్జిట్‌ పోల్సే నిజమయ్యాయి. భారీ ఆధిక్యంతో దిశగా కాంగ్రెస్‌ పార్టీ దూసుకుపోతోంది. ఇప్పుడు కాంగ్రెస్‌ను బీట్‌ చేయడం కాదు కదా రీచ్‌ అవ్వడం కూడా బీఆర్‌ఎస్‌ పార్టీకి కష్టంగానే మారింది. నిజానికి ఉదయం పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపుతోనే రిజల్ట్‌లో ఓ క్లారిటీ వచ్చింది. ఉదయం నుంచి కాంగ్రెస్‌ మెజార్టీ పెరుగుతూనే ఉంది. కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్‌ లీడ్‌లో ఉన్నా.. కాంగ్రెస్‌ను క్రాస్‌ చేసి కారు ముందుకు వెళ్లలేకపోయింది. ఇక కాంగ్రెస్‌దే అధికారం అని అంతా డిసైడయ్యారు. రేవంత్‌ ఇంటిముందు కాంగ్రెస్‌ కార్యకర్తలు సంబరాలు కూడా చేసుకున్నారు. తెలంగాణ ఉన్నతాధికారులు కూడా స్వయంగా వచ్చి రేవంత్‌ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

ఓట్ల లెక్కింపు పూర్తైనా.. బీఆర్‌ఎస్‌ ఇప్పుడు కాంగ్రెస్‌ను బీట్‌ చేయ్యలేదు. దీంతో ఓటమిని స్వయంగా ఒప్పుకున్నారు మంత్రి కేటీఆర్‌. ట్విటర్‌లో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా.. తెలంగాణ ప్రజలకు తాము కృతజ్ఞులుగా ఉంటామన్నారు. రెండుసార్లు తమకు అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు రుణపడి ఉంటామని చెప్పారు. ఇవాళ వచ్చిన రిజల్ట్ తనను బాధ పెట్టిందన్నారు. తాము అనుకున్న ఫలితాలు రాకపోవడం నిరాశకు గురి చేసిందంటూ పోస్ట్ చేశారు. ఈ ఓటమితో నేర్చుకున్న పాఠాలతో ఖచ్చితంగా తిరిగి మళ్లీ అధికారంలోకి వస్తామన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు గుడ్‌లక్‌ చెప్తూ ట్వీట్‌ చేశారు.