DK ARUNA: గద్వాల నుంచి పోటీకి డీకే అరుణ దూరం.. కారణం ఏంటంటే..
గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. అధిష్టానానికి డీకే అరుణ తన నిర్ణయాన్ని తేల్చి చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ పరిణామంతో గద్వాలలో బిజెపి నుంచి ఎవరు బరిలోకి దిగబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.
DK ARUNA: తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు జరుగుతున్నాయ్. కోమటిరెడ్డి, వివేక్ ఎగ్జిట్ ఇవ్వగా.. పార్టీలో నెక్ట్స్ ఏంటి అనే చర్చ జోరుగా సాగుతోంది. నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ రాష్ట్ర పెద్దలు డాక్టర్ లక్ష్మణ్, కిషన్ రెడ్డి పోటీ చేయట్లేదని ఇప్పటికే ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా తాము ప్రచారం చేస్తామని వెల్లడించారు. ఐతే ఇదే వరుసలో గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. అధిష్టానానికి డీకే అరుణ తన నిర్ణయాన్ని తేల్చి చెప్పారు.
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ పరిణామంతో గద్వాలలో బిజెపి నుంచి ఎవరు బరిలోకి దిగబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. గద్వాల నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ నిరాసక్తత చూపడంతో గద్వాలలో లీడర్‌షిప్ కనిపించడం లేదు. ఓవైపు బీఆర్ఎస్ నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని బీఆర్ఎస్ మళ్లీ ప్రతిపాదించగా.. కాంగ్రెస్ నుంచి సరితను అభ్యర్థిగా ప్రకటించారు. ఐతే బిజెపి నుంచి మాత్రం అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంటే.. బీజేపీ మాత్రం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.
ఐతే తను స్వయంగా చేసుకున్న సర్వేల్లో మూడో స్థానంలో రావడంతో డీకే అరుణ వెనకంజ వేశారని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఐతే గద్వాలలో బీసీ అభ్యర్థిని బరిలోకి దింపబోతున్నట్టు పార్టీ శ్రేణులు చెప్తున్నా.. బీసీని రంగంలోకి దింపితే అది ఏమేరకు ఫలితాలను ఇస్తుంది అనేది మాత్రం ఆసక్తికరమే.