YS SHARMILA: షర్మిల పార్టీకి గుర్తు కేటాయించిన ఎన్నికల సంఘం.. వైటీపీ గుర్తుపై సెటైర్లు..!

షర్మిల మీద, ఆమె పార్టీ మీద రియాక్ట్ అయ్యేందుకు కూడా ప్రత్యర్థి పార్టీలు కనీసం ఇష్టం చూపించలేదు. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు వైటీపీ పరిస్థితి ఏంటా అని! దీంతో కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేసి అయినా తన ఉనికి చాటుకుందామని షర్మిల ప్రయత్నించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 26, 2023 | 08:36 PMLast Updated on: Oct 26, 2023 | 8:36 PM

Election Commission Alloted Binocular Symbol To Ysrtp

YS SHARMILA: రాజన్న రాజ్యమే లక్ష్యం అంటూ.. తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసిన షర్మిలకు ప్రతీది పీడ కలగానే మిగిలింది. వైఎస్ అభిమానులంతా పార్టీలో చేరుతారు.. తెలంగాణలో రాజ్యాధికారం తమదే అని షర్మిల కన్న కలలు అన్నీ ఇన్నీ కావు. నిరుద్యోగ దీక్షలని ఒకసారి.. రైతు దీక్షలని మరోసారి.. ఇలా ఎన్ని చేసినా అనుకున్న మైలేజ్‌ సాధించడంలో షర్మిల సక్సెస్ కాలేకపోయారు. చివరికి రాష్ట్రం అంతా పాదయాత్ర చేసినా.. పోలీసులను షర్మిల కొట్టిన ఎపిసోడే గుర్తుంది తప్ప.. వైటీపీని ఓ రాజకీయ పార్టీగా గుర్తించలేదు ఎవరూ !

షర్మిల మీద, ఆమె పార్టీ మీద రియాక్ట్ అయ్యేందుకు కూడా ప్రత్యర్థి పార్టీలు కనీసం ఇష్టం చూపించలేదు. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు వైటీపీ పరిస్థితి ఏంటా అని! దీంతో కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేసి అయినా తన ఉనికి చాటుకుందామని షర్మిల ప్రయత్నించారు. ఢిల్లీ లెవల్‌లో మంతనాలు జరిపారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సాయంతో.. విలీనం ప్రక్రియకు అడుగులు వేశారు. ఐతే అదీ సక్సెస్ కాలేదు. దీంతో మీకు మారే.. మాకు మేమే అన్నట్లుగా ఒంటరిపోరుకు సిద్ధం అయ్యారు షర్మిల. ఇప్పటికే అభ్యర్థుల కోసం దరఖాస్తులను కూడా ఆహ్వానించారు. ఊహించని లెవల్‌లో రెస్పాన్స్ వస్తుందని చెప్తున్నా.. షర్మిల మాటలు ట్రోల్స్‌, మీమ్స్‌గానే మిగిలిపోయాయ్. ఇదంతా ఎలా ఉన్నా.. వైటీపీకి ఇప్పటివరకు గుర్తు లేదు. ఎన్నికల వేళ షర్మిల పార్టీ గుర్తు కేటాయించింది ఎన్నికల సంఘం.

రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఆ పార్టీకి బైనాక్యులర్‌ గుర్తును కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఐతే ఈ గుర్తు మీద ఇప్పుడు మీమ్స్ పేలుతున్నాయ్. షర్మిల పార్టీకి వచ్చిన ఓట్లు లెక్కించేందుకే ఈ గుర్తు కేటాయించి ఉంటుందని కొందరు సెటైర్లు వేస్తుంటే.. బైనాక్యులర్ గుర్తు కాదు బాణం గుర్తు కేటాయించాల్సింది అని మరికొందరు జోకులు వేస్తున్నారు. ఏమైనా పార్టీకి గుర్తు కేటాయించడంతో.. వైటీపీ ప్రచారం మరింత ముమ్మరం చేసేందుకు సిద్ధం అవుతోంది.