CMD Prabhakar resigns : ఫస్ట్ వికెట్‌ డౌన్‌..! ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌ రాజీనామా..

ప్రభుత్వం మారిన ప్రతీసారి.. వ్యవస్థలో మార్పులు ఖాయం. ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా.. ఇదే నిజం. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరగబోతుందా అంటే.. ఇప్పటికిప్పుడు సమాధానం చెప్పలేకపోయినా.. కుర్చీలు మాత్రం మారిపోతున్నాయ్. బీఆర్ఎస్ ఓడిపోయి.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత.. కీలక వ్యక్తి తన పదవికి రాజీనామా చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 4, 2023 | 02:34 PMLast Updated on: Dec 04, 2023 | 2:36 PM

First Wicket Down Transco Cmd Prabhakar Resigns

ప్రభుత్వం మారిన ప్రతీసారి.. వ్యవస్థలో మార్పులు ఖాయం. ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా.. ఇదే నిజం. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరగబోతుందా అంటే.. ఇప్పటికిప్పుడు సమాధానం చెప్పలేకపోయినా.. కుర్చీలు మాత్రం మారిపోతున్నాయ్. బీఆర్ఎస్ ఓడిపోయి.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత.. కీలక వ్యక్తి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఫస్ట్ వికెట్ డౌన్ అంటూ.. సోషల్‌ మీడియాలో హోరెత్తిపోతోది. ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ పదవికి దేవులపల్లి ప్రభాకర్‌ రావు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామా చేయడం ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది.

200 కోట్లు VS సీతక్క ..! బీఆర్ఎస్ ను గెలిపించలేని కోట్లు

సీఎండీ వంటి కీలక పోస్టులో ఐఏఎస్ అధికారులను నియమిస్తుంటారు. ఐతే గులాబీ సర్కార్ మాత్రం రిటైర్డ్ ఐఏఎస్ ప్రభాకర్ రావును సీఎండీగా నియమించింది. అప్పటి నుంచి పదవీ కాలం ముగిసిన ప్రతిసారీ ప్రభుత్వం రెండేళ్ల పాటు పొడిగిస్తూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ప్రభాకర్ రావు బాధ్యతల నుంచి తప్పుకోవడంపై కొత్త జరుగుతోంది. రాష్ట్రంలో 24గంటల పాటు విద్యుత్‌ అందించడంలో ప్రభాకర్‌ రావు కీలక పాత్ర పోషించారనే పేరు ఉంది. 2014, జూన్‌ 5న జెన్‌కో సీఎండీగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. అదే ఏడాది అక్టోబర్‌ 25న ట్రాన్స్‌కో ఇన్‌చార్జిగా నియమితులయ్యారు. ముందుగా ఆయనను రెండేళ్ల పదవీ కాలానికి సీఎండీగా ప్రభుత్వం నియమించినా.. తర్వాత పదవీ కాలాన్ని పొడిగిస్తూ వస్తోంది. దాదాపు 54 ఏళ్లపాటు విద్యుత్ సంస్థకు ప్రభాకర్‌ రావు సేవలు అందించారు.