Neelam Madhu : ఎమ్మెల్యే బరిలో నీలం మధు.. ఏ పార్టీ నుంచి అంటే..?
తెలంగాణ రాజకీయాలు పరిచయం ఉన్న వాళ్లకు నీలం మధు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో స్టార్‌గా ఉన్న నీలం మధు.. చాలామందికి చేరువయ్యారు కూడా. పటాన్‌చెరు నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో కారు పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో బరిలో నిలవాలని డిసైడ్అ య్యారు.
తెలంగాణ రాజకీయాలు పరిచయం ఉన్న వాళ్లకు నీలం మధు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో స్టార్‌గా ఉన్న నీలం మధు.. చాలామందికి చేరువయ్యారు కూడా. పటాన్‌చెరు నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో కారు పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో బరిలో నిలవాలని డిసైడ్ అయ్యారు. అయితే నీలం మధు ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారన్నది.. పటాన్‌చెరుతో పాటు అన్ని పార్టీలో చర్చకు దారి తీస్తోంది. సెప్టెంబర్ 16న బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన మధు.. ఆ రోజు నుంచి నియోజకవర్గంలో పాదయాత్ర మొదలుపెట్టారు.
ఏ పార్టీ తనకు టికెట్ ఇచ్చినా.. ఆ పార్టీ నుంచి పోటీ చేయడానికి సిద్ధం అని ప్రకటించారు. ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోతే.. స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలో ఉంటానని ప్రకటించి.. పెద్ద చర్చక దారి తీశారు నీలం మధు. బీజేపీకి చెందిన సీనియర్ నేత ఈటల రాజేందర్ ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వారు. ఐతే తన సామాజిక వర్గమే కావడంతో.. మధు కూడా బీజేపీ లో చేరబోతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక అటు కాంగ్రెస్ కూడా మధును వదులుకునేందుకు సిద్ధంగా లేదు. జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత.. మధు కు కాంగ్రెస్ టికెట్ ఇప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
అయితే రెండు పార్టీల నుంచి ఆహ్వానాలు అందినా.. ఎవరైతే ముందుగా తన పేరు ప్రకటిస్తారో.. ఆ పార్టీలో చేరేందుకు నీలం మధు కండిషన్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఐతే బీజేపీ, కాంగ్రెస్‌లో.. పటాన్‌చెరు నుంచి టికెట్ ఆశిస్తున్న జాబితా పెద్దగానే ఉంది. కమలం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, గడీల శ్రీకాంత్ గౌడ్, గోదావరి అంజి రెడ్డి, ఎడ్ల రమేష్ టికెట్ ఆశిస్తున్నారు.తమను కాదని నీలం మధు టికెట్ ఇస్తే.. ఆ నలుగురు నాయకులు పార్టీలోనే ఉంటారా.. ఉంటే మధుకి సహకరిస్తారా అనేది ఒక పెద్ద ప్రశ్నగా మిగలనుంది.
ఇక అటు కాంగ్రెస్ నుంచి 2018 ఎన్నికల్లో పోటీ చేసిన కాట శ్రీనివాస్ గౌడ్ టికెట్ రేసులో ముందంజలో ఉన్నారు. మరొక సీనియర్ నాయకుడు గాలి అనిల్ కుమార్ కూడా సీటు కోసం తన ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్తగా వచ్చినవాళ్లకే పెద్దపీట వేస్తు న్నారనే విమర్శలు వినిపిస్తున్న వేళ.. మధు అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పరిశీలిస్తుందా.. ఒకవేళ తనను అభ్యర్థిగా ప్రకటిస్తే.. మధుకి కాటా, గాలి సహకరిస్తారా అనేది మరో పెద్ద ప్రశ్న. అయితే ఇక అటు చివరి అవకాశంగా బహుజన్ సమాజ్ పార్టీ నుంచి కానీ.. ఫార్వర్డ్ బ్లాక్ నుంచి కానీ.. నీలం మధు పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.