Former CM KCR యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన మాజీ సీఎం కేసీఆర్..

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత.. కేసీఆర్ యశోద ఆసుపత్రి నుంచి శుక్రవారం ఉదయం కాసేపటి క్రితమే డిశ్చార్జ్‌ అయ్యారు. గత వారం రోజులకు పైగా కేసీఆర్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.. గాయం నుంచి పూర్తిగా కోలుకోవాలంటే సుమారు 6 నుంచి 8 వారాలు పడుతుందని వైద్యులు చెప్పడంతో.. నందినగర్‌ నివాసానికి తీసుకెళ్లి ఆయనను జాగ్రత్తగా చూసుకోవాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. దీంతో కేసీఆర్ ను బంజారాహిల్స్ నందినగర్ లోని తన నివాసానికి తీసుకెళ్లున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 15, 2023 | 11:58 AMLast Updated on: Dec 15, 2023 | 11:58 AM

Former Cm Kcr Discharged From Yashoda Hospital

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత.. కేసీఆర్ యశోద ఆసుపత్రి నుంచి శుక్రవారం ఉదయం కాసేపటి క్రితమే డిశ్చార్జ్‌ అయ్యారు. గత వారం రోజులకు పైగా కేసీఆర్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.. గాయం నుంచి పూర్తిగా కోలుకోవాలంటే సుమారు 6 నుంచి 8 వారాలు పడుతుందని వైద్యులు చెప్పడంతో.. నందినగర్‌ నివాసానికి తీసుకెళ్లి ఆయనను జాగ్రత్తగా చూసుకోవాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. దీంతో కేసీఆర్ ను బంజారాహిల్స్ నందినగర్ లోని తన నివాసానికి తీసుకెళ్లున్నారు.

కేసీఆర్ కు వైద్యుల సూచనలు..

కేసీఆర్‌ తన గాయం నుంచి కోలుకుంటుండగా.. పూర్తిగా రెస్ట్ తీసుకోవటానికి పరిమితం కావొద్దని వైద్యులు హెచ్చరించారు. సమయం దొరికినప్పుడల్లా పుస్తకాలు చదువుతూ మెదడుకు పని చెప్తూనే ఉండాలన్నారు. సాధారణంగానే.. చదవటం అంటే కేసీఆర్‌కు ఇష్టం. దీంతో ఇప్పడు ఆస్పత్రిలో ఖాళీగా ఉండటం ఇష్టం లేక.. ప్రముఖ పుస్తకాలు తెప్పించుకుని చదువుతున్నారు. చాలా మంది పరామర్శించేందుకు వస్తున్నారు. వారిని కలిసిన తర్వాత మిగతా సమయం పుస్తకాలు చదువుతూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పటికే వాకర్ సాయంతో కేసీఆర్‌ను నడిపించారు డాక్టర్లు. పూర్తిగా మంచానికి పరిమితం కాకుండా కొన్ని శరీరకా యాక్టివిటీస్ చేస్తు ఉండాలని సూచించారు.

కేసీఆర్ కు ప్రస్తుతం నిలకడగా ఉన్నారు. ఆపరేషన్ నొప్పి తగ్గింది. ప్రస్తుతం ఆయనకు సాధారణ నొప్పి మాత్రమే ఉందని యశోద ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. ఇప్పుడు మార్చారు అయిన కొన్ని రోజులు ఫిజియోథెరపీ కొనసాగించాల్సి ఉంటుంది.