CM Revanth Reddy : మాజీ సీఎం కేసీఆర్ పరామర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి

యశోద ఆసుపత్రికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి యశోద ఆసుపత్రికి వెళ్లనున్నారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి పరామర్శించనున్నారు. ప్రస్తుతం కేసీఆర్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రేవంత్ రెడ్డి మధ్యాహ్నం ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్ ప్రమాదం ఆరా తీయనున్నారు. ఇక శుక్రవారం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆధ్వర్యంలో కేసీఆర్ కు 20 మంది వైద్యుల బృందం సర్జరీ నిర్వహించింది. ఆ తర్వాత పలువు సీనియర్ జానారెడ్డి వంటి నాయకులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శిస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 10, 2023 | 12:36 PMLast Updated on: Dec 10, 2023 | 12:36 PM

Former Cm Kcr Will Visit Cm Revanth Reddy

యశోద ఆసుపత్రికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి యశోద ఆసుపత్రికి వెళ్లనున్నారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి పరామర్శించనున్నారు. ప్రస్తుతం కేసీఆర్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రేవంత్ రెడ్డి మధ్యాహ్నం ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్ ప్రమాదం ఆరా తీయనున్నారు. ఇక శుక్రవారం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆధ్వర్యంలో కేసీఆర్ కు 20 మంది వైద్యుల బృందం సర్జరీ నిర్వహించింది. ఆ తర్వాత పలువు సీనియర్ జానారెడ్డి వంటి నాయకులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శిస్తున్నారు.

కేసీఆర్‌కు హిప్ రిప్లేస్‌మెంట్ ఆపరేషన్‌ విజ‌య‌వంత‌మైంద‌ని, ఆయ‌న కోలుకుంటున్నార‌ని యశోద ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వాక‌ర్ సాయంతో కేసీఆర్ న‌డుస్తున్నార‌ని చెప్పారు. మ‌రో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేసే అవ‌కాశం ఉంద‌ని వారు వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని, త్వరగా కోలుకోవడానికి అనుకూలంగా శరీరం సహకరిస్తోందన్నారు.

ఇప్పటికే కేసీఆర్ ను పరామర్శించేందుకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితులను వైద్యులతో.. మాజీ మంత్రి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు.

గురువారం 8వ తేదిన అర్దరాత్రి దాటిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రం ఎర్రవల్లి గ్రామం ఫామ్ హౌస్ లో జారిపడ్డారు. దీంతో ఆయన హాటా హాటినా హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఆరోగ్యంపై పరిక్షలు చేయగా ఆయన ఎడమ కాళి తుంటికి గాయమైంది అని వైద్యులు నిర్ధారించారు. అయితే.. మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి తెలిసిన వెంటనే సీఎం రేవంత్‌ రెడ్డి వివరాలు ఆరా తీసారు. కేసీఆర్ కు మెరుగైన వైద్య చికిత్స అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అనంతరం యశోద ఆసుపత్రికి భద్రత పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఇవాళ సీఎం తానే స్వయంగా యశోద ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్‌ ని పరామర్శించనున్నారు. సీఎంతో పాటుగా ఇతర మంత్రులు, ఎమ్మెల్యే కూడా యశోద ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్ ను పరార్శించనున్నట్టుగా సమాచారం.