Ponguleti Srinivas : కాంట్రాక్టర్ నుంచి మంత్రి దాకా..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ని నామరూపాలు లేకుండా చేస్తా అన్నారు.. ఒక్క భద్రాచలం తప్ప అన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ అధిష్టానానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న శ్రీనివాస్ రెడ్డికి కేబినెట్ లో మంత్రి పదవి లభించింది. పాలేరు నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ని నామరూపాలు లేకుండా చేస్తా అన్నారు.. ఒక్క భద్రాచలం తప్ప అన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ అధిష్టానానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న శ్రీనివాస్ రెడ్డికి కేబినెట్ లో మంత్రి పదవి లభించింది. పాలేరు నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
శీనన్న అని ఉమ్మడి ఖమ్మం జిల్లా అభిమానులు పిలుచుకునే శ్రీనివాస్ రెడ్డి.. ఖమ్మం జిల్లాలోని నారాయణ పురంలో పుట్టారు. 1984లో కల్లూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివారు. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో డిస్టెన్స్ లో బీఏ పూర్తి చేశారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన.. తర్వాత కాంట్రాక్టర్ గా స్థిరపడ్డారు. 1985లో ఎన్టీఆర్ హయాంలో పేరువంచ మేజర్ పై క్రాస్ వాల్ నిర్మాణం చేశారు. దాంతో 450 ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. అలా కాంట్రాక్టర్ గా మారి ప్రభుత్వం తరపున ఎన్నో నిర్మాణాలు చేశారు.
Konda Surekha : కొండా సురేఖ అనే నేను..
మొదట కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా కొనసాగిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. తర్వాత వివిధ హోదాల్లో పనిచేశారు. 2013లో వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరి.. కొంతకాలం వైసీపీ తెలంగాణ అధ్యక్షుడిగా కూడా కొనసాగారు. 2014లో ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి.. టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై విజయం సాధించారు. ఆ తర్వాత వైసీపీ.. ఏపీకి పరిమితం అవడంతో.. బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు పొంగులేటి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో, 2019 లోక్ సభ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చారు. కానీ గులాబీ పార్టీ ఆయన సేవలను గుర్తించలేదు. దాంతో విసుగు చెందిన ఆయన.. ఖమ్మంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆ పార్టీ పొంగులేటిని సస్పెండ్ చేసింది. తర్వాత 2023 జులై 2 న ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ జనగర్జనలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ అసెంబ్లీ ఎన్నికల కోసం టీపీసీసీ ప్రచార కమిటీ కో ఛైర్మన్ గా పొంగులేటి నియమితులయ్యారు. పాలేరు నుంచి గెలచిని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. మొదటిసారిగా మంత్రి పదవిని చేపట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ.. నిత్యం జనంలో జరిగే పొంగులేటికి… రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రి పదవి దక్కడంతో ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పండగ చేసుకుంటున్నారు.