Telangana Minister : విధేయతకు పట్టం.. విద్యార్థి నేత నుంచి మంత్రి దాకా..
తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నేత అయిన పొన్నం ప్రభాకర్ కు ఉన్న పార్టీ విధేయతను చూసి.. ఆయనకు మంత్రిగా ఛాన్స్ ఇచ్చింది హైకమాండ్. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా ప్రమాణం చేశారు. ఎంపీగా, ఎమ్మెల్యేగానే కాకుండా.. కాంగ్రెస్ పార్టీలో కూడా ఎన్నో పదవులను నిర్వహించారు పొన్నం.

1967లో కరీంనగర్ లో జన్మించిన పొన్నం ప్రభాకర్.. హైదరాబాద్ లోని ఉస్మానియాలో బీఏ, LLB పూర్తి చేశారు. 1987లో SRR గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదివే రోజుల్లో విద్యార్థి నాయకుడిగా, యూనియన్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1987-89 మధ్యకాలంలో NSUI జిల్లా ప్రధానకార్యదర్శిగా పనిచేశారు. 1999-2002 మధ్యకాలంలో NSUI రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2009 వరకూ ఆయన మార్క్ ఫెడ్ విదేశాంగ ఛైర్మన్ గా పనిచేశారు.
2009లో కాంగ్రెస్ తరపున కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి గెలిచారు పొన్నం ప్రభాకర్. ఈ 15వ లోక్ సభకు ఎన్నికైన అతి పిన్నవయస్సున్న పార్లమెంట్ సభ్యుడు పొన్నం. ఎంపీగా ఉన్నప్పుడే.. వివిధ పార్లమెంట్ కమిటీల్లో పనిచేశారు. 2014లో కరీంనగర్ ఎంపీగా ఓడిపోయారు. ఆ తర్వాత 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసి… ఓడిపోయారు. తర్వాత 2018లోనే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ నుంచి విజయం సాధించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ గా పాల్గొన్న ఎంపీల్లో పొన్నం ప్రభావకర్ కూడా ఒకరు. ప్రత్యేక రాష్ట్ర కాంక్షను కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి తీసుకురావడంలోనూ కీలకంగా వ్యవహరించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ను రూపొందించిన కమిటీకి ఛైర్మన్ గా పొన్నం వ్యవహరించారు.