Gaddam Prasad Kumar : తెలంగాణ మూడో అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక..
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ పేరును ప్రొటెం స్పీకర్ అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ మూడో స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Gaddam Prasad Kumar was unanimously elected as Telangana's third assembly speaker.
తెలంగాణలో మూడో అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలైన అనంతరం వివిధ పార్టీ సభ్యులతో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించిన ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ.. ఎమ్మెల్యేలుగా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి, కొత్త ప్రభాకర్ రెడ్డి, పద్మారావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ పేరును ప్రొటెం స్పీకర్ అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ మూడో స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.