Telangana Result : హస్తం చేతికి తెలంగాణ.. ముందే చెప్పిన డయల్‌న్యూస్‌..

ఎవరు గెలుస్తారు.. ఎన్ని సీట్లు తెచ్చుకుంటారు.. ఎంత తేడాతో గెలుస్తారు.. ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికింది. మహా సస్పెన్స్‌కు ఫుల్‌స్పాట్ పడింది. హస్తం చేతుల్లోకి తెలంగాణ వెళ్లిపోయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 3, 2023 | 06:41 PMLast Updated on: Dec 03, 2023 | 6:41 PM

Hand In Hand Telangana Dialnews Mentioned Earlier

ఎవరు గెలుస్తారు.. ఎన్ని సీట్లు తెచ్చుకుంటారు.. ఎంత తేడాతో గెలుస్తారు.. ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికింది. మహా సస్పెన్స్‌కు ఫుల్‌స్పాట్ పడింది. హస్తం చేతుల్లోకి తెలంగాణ వెళ్లిపోయింది. కాంగ్రెస్ అద్భుతమైన విజయం సాధించింది. డిసెంబర్‌ 9న ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి ఎల్బీ స్టేడియంలో చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయ్. ఐతే కాంగ్రెస్‌ గెలుపును డయల్‌న్యూస్‌ ముందే ప్రెడిక్ట్ చేసింది. గెలవబోయేది కాంగ్రెస్సే అని బల్లగుద్ద మరీ చెప్పింది. నిజానికి పోలింగ్ తర్వాత రకరకాల ఎగ్జిట్‌పోల్స్‌ ప్రకటించగా.. చాలా వాటిలో క్లారిటీ లేకపోగా.. మరింతి కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాయ్. ఐతే డయల్‌న్యూస్ మాత్రం పర్ఫెక్ట్ ఎగ్జిట్‌పోల్స్ అందించింది. బీఆర్ఎస్‌కు 39 నుంచి 40 స్థానాలు.. కాంగ్రెస్‌కు 65 నుంచి 70.. బీజేపీకి 8 నుంచి 9 స్థానాలు.. ఎంఐఎంకు 6 నుంచి 7 స్థానాలు వస్తాయని డయల్‌న్యూస్ ఎగ్జిట్‌పోల్‌ ఇచ్చింది.

డయల్‌న్యూస్‌ టీమ్‌ ఇచ్చిన ఫలితాలే ఇప్పుడు యధావిధిగా వచ్చాయ్. కాంగ్రెస్‌ 65 సీట్లు తెచ్చుకుంటే.. బీఆర్ఎస్‌ 39, బీజేపీ 08, ఎంఐఎం 7 స్థానాల్లో విజయం సాధించింది. ముందు డయల్‌న్యూస్ ఏం చెప్పిందో.. ఫలితాల రోజు అదే నంబర్‌ కనిపించింది. ప్రతీ నియోజకవర్గంవారీగా, అభ్యర్థివారీగా.. సర్వే నిర్వహించారు. అన్ని ఫలితాలను పరిశీలించి.. ఎగ్జిట్‌పోల్ రిపోర్ట్ బయటపెట్టింది టీమ్‌. డయల్‌న్యూస్‌ ఎగ్జిట్‌పోల్‌పై సోషల్‌ మీడియాలో రకరకాల చర్చ జరగ్గా.. మా స్టాండ్ ఎప్పుడూ మారలేదు. నిజాలు ఎంత నికచ్చిగా చెప్తామో.. మరోసారి డయల్‌న్యూస్ ఎగ్జిట్‌పోల్‌తో నిజమైంది. కాంగ్రెస్‌ చేతుల్లోకి తెలంగాణ రాబోతోంది. జనాల ఆశలకు, అనుగుణంగా పాలన సాగించాలని కోరుతూ.. డయల్‌న్యూస్ విషెస్.. ఆల్ ది బెస్ట్‌..