Congress, Majlis : మజ్లిస్ తో కాంగ్రెస్ దోస్తీ కుదిరిందా..!
తెలంగాణలో ప్రభుత్వం మారిపోవడంతో.. రాజకీయ సమీకరణాలు కూడా మారిపోతున్నాయి. ఒకప్పుడు ఉప్పూ – నిప్పూలాగా ఉండే పార్టీలు ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోతున్నాయి. మొన్నటిదాకా BRS తో ఫ్రెండ్షిప్ చేసిన MIM ఇప్పుడు కాంగ్రెస్ తో దోస్తీకి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఏపీలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పటి నుంచీ MIM-కాంగ్రెస్ మధ్య వార్ నడుస్తోంది. తెలంగాణ వచ్చాక పదేళ్ళ పాటు BRS అధికారంలో ఉండటంతో.. ఆ పార్టీతో దోస్తీ చేసింది MIM. ఒకానొక దశలో BRS కారు స్టీరింగ్ ఓవైసీ బ్రదర్స్ చేతుల్లో ఉన్నాయన్న విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో.. MIM దగ్గరవుతున్నట్టు తెలుస్తోంది.

FILES MISSING: తెలంగాణలో…. పాత ఫైల్స్ ఎత్తుకుపోతున్నరు!
అసెంబ్లీలో ఎంతోమంది సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ.. ఏరి కోరి అక్బరుద్దీన్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రొటెం స్పీకర్ గా ఎంపిక చేసింది. దాంతో రెండు పార్టీల మధ్య మళ్ళీ దోస్తానా మొదలైందన్న చర్చ నడుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఈ బంధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మినా.. దగ్గినా పడిపోతుంది. అందుకే మజ్లిస్ ను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఇది నిజమేనేమో అనిపిస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి 64 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. అంటే మెజారిటీ జస్ట్ నలుగురే ఎక్కువ. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు BRS లోకి దూకినట్టు ఏదైనా జరిగితే ప్రభుత్వం కొనసాగడం కష్టమే. అందుకే MIM తో మచ్చిక చేసుకుంటే మరో ఏడుగురు ఎమ్మెల్యేల సపోర్ట్ తమకు ఉంటుందని భావిస్తోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ హయాంలో కాంగ్రెస్ తో MIMకి ఫ్రెండ్షిప్ ఉండేది. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాక.. అక్బరుద్దీన్ ఓవైసీని జైలుకు పంపారు. దాంతో రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా తాము కాంగ్రెస్ ను వెంటాడతామని అప్పట్లో అక్బరుద్దీన్ మండిపడ్డారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ కాంగ్రెస్ పై అభ్యర్థులను నిలబెట్టడం.. పరోక్షంగా BRS గెలుపునకు MIM సహకరించింది. అయితే హైదరాబాద్ లో గెలిచిన మజ్లిస్ పార్టీ అభ్యర్థులకు గతంలో కంటే మార్జిన్స్ తగ్గాయి. రాష్ట్రమంతటా కూడా ముస్లింలు కాంగ్రెస్ కే ఓట్లేశారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ తో సయోధ్యే బెటర్ అని ముస్లిం మత పెద్దలు కూడా ఓవైసీ బ్రదర్స్ కి సూచించినట్టు సమాచారం. అందుకే పాత కక్షలన్నీ మర్చిపోయి.. ఇప్పుడు రెండు పార్టీలు దోస్తీకి సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ పై కక్ష పెంచుకుంటే.. అది పరోక్షంగా బీజేపీకి లబ్ది చేకూర్చినట్టు అవుతుందని మజ్లిస్ భావిస్తోంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ – మజ్లిస్ బంధం బలపడితే.. అది పరోక్షంగా దేశవ్యాప్తంగా హస్తం పార్టీకి ప్లస్సే అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.