Telangana : తెలంగాణ సీమాంధ్రులు మనసు మార్చుకున్నారా? .. మళ్లీ బీఆర్ఎస్ వైపే చూస్తున్నారా ?

తెలంగాణలో 26 ఆంధ్ర బీసీ కులాల వారిని బీసీ జాబితా నుండి తప్పించినప్పుడు ఆంధ్ర కమ్మ వాళ్లంతా ఏమయ్యారని ప్రశ్నించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 9, 2023 | 09:38 AMLast Updated on: Nov 09, 2023 | 10:56 AM

Have The Telangana Seamen Changed Their Minds Are You Looking At Brs Again

తెలంగాణ (Telangana )లో రాజకీయ ( Politics) పరిస్థితులు సమీకరణలు రోజురోజుకీ మారుతున్నాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలు.. తెలంగాణలో సీమాంధ్ర (Seemandhras) లు BRSకు వ్యతిరేకంగా కాంగ్రెస్ (Congress) కు అనుకూలంగా ఓటు వేస్తారన్న ప్రచారం జరిగింది. చంద్రబాబు (Chandrababu) అరెస్టు తర్వాత హైదరాబాద్ లో సైబర్ సిటీలో నిరసన ప్రదర్శనలు జరపడానికి వీల్లేదని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సీమాంధ్రుల్లో కొందరిని బాధ పెట్టాయి. ఈసారి ఎన్నికల్లో సీమాంధ్ర లంతా BRSకు వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. వాళ్లకి అనుకూలంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచి టీడీపీ కూడా తప్పుకుంది. దాంతో టీడీపీకి (TDP) పడే ఓట్లన్నీ కాంగ్రెస్ కి పడతాయని అందరూ అంచనా వేశారు. 25 నియోజకవర్గాల్లో ఫలితాలపై సీమాంధ్ర ఓట్లు కచ్చితంగా ప్రభావం చూపిస్తాయని భావించారు. టిడిపి పోటీ నుంచి వైదొలగడం, BRS పై సీమాంధ్రుల ఆగ్రహం చూసి కారు పార్టీ అభ్యర్థులు వణికిపోయారు.

కూకట్ పల్లి, శేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, పటాన్ చెరు, సనత్ నగర్, ఖమ్మం, మిర్యాలగూడ తోపాటు.. సీమాంధ్రుల ప్రభావం ఉండే ఇతర నియోజకవర్గాల్లో ఫలితాలు తారుమారు అవుతాయని బేజారి ఎత్తిపోయారు. అయితే దీనికి విరుగుడు కూడా కనిపెట్టారు. సీమాంధ్రులు అంటే కమ్మ కులస్థులేనా మిగిలిన కులాల వాళ్ళు లేరా.. కమ్మవాళ్ళు ఏదీ నిర్ణయిస్తే.. దాన్ని మిగిలిన కులాలు ఫాలో అవుతాయా అనే చర్చ కూడా మొదలైంది. సీమాంధ్రల ప్రభావం ఉండే నియోజకవర్గాల్లో అన్ని కులాలతో విడి విడిగా సమావేశాలు పెట్టారు. ప్రధానంగా ఆంధ్ర కాపులు, బీసీలతో హాట్ హాట్ చర్చలు జరిగాయి. చంద్రబాబు అరెస్టు అయితే తెలంగాణలో ఉండే మిగిలిన కులాల వాళ్లందరికీ ఏంటి సంబంధం? అది కమ్మ వాళ్ల సమస్య.. వాళ్ళకి సమస్య వస్తే మిగిలిన కులాల అందరూ తమ నిర్ణయాన్ని మార్చుకోవాలా అంటూ మిగిలిన అందర్నీ ప్రశ్నించారు.

తెలంగాణలో 26 ఆంధ్ర బీసీ కులాల వారిని బీసీ జాబితా నుండి తప్పించినప్పుడు ఆంధ్ర కమ్మ వాళ్లంతా ఏమయ్యారని ప్రశ్నించారు. దీంతో అనూహ్యంగా సీమాంధ్రలో ఊహించని మార్పు వచ్చింది. విభజన తర్వాత హైదరాబాద్ లో, మిగిలిన ప్రాంతాల్లో ప్రశాంతంగా ఉన్నాం. వ్యాపారాలు బాగున్నాయి. ఉద్యోగాలు ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో అసలు BRSను విభేధించాల్సిన అవసరం ఏముంది అనే ప్రశ్న తలెత్తింది. చంద్రబాబు అరెస్టు అయితే అది టీడీపీ వాళ్లకి, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన సమస్య. మిగిలిన వాళ్లకు ఆ గొడవతో సంబంధం ఏంటి అనే ప్రశ్న వచ్చింది. క్రమంగా సీమాంధ్రుల్లో చాలామందిలో ఆలోచన మారింది.

అంతేకాదు అసలు టీడీపీ పోటీ నుంచి తప్పుకున్న కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు అన్నట్లు.. మనకు వివాదంతో ఏం సంబంధం అనే చర్చ జరిగింది. ఎప్పుడైతే మిగిలిన కులాలందరూ.. క్రమంగా ఆలోచన మార్చుకున్నా రో తెలంగాణలో కమ్మ వాళ్ళందరికీ ఇప్పుడు పునరాలోచన మొదలైంది. అరెస్టు చేసింది జగన్ సర్కార్. మనం ఓటేయాల్సి వస్తే.. జగన్ కు వ్యతిరేకంగా ఆంధ్రకెళ్ళి ఓటేయాలి. అంతేగాని ఇక్కడ BRSకి వ్యతిరేకంగా ఓటేస్తే ఏంటి లాభం అనే చర్చ మొదలైంది. మరోవైపు BRS సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా.. సీమాంధ్ర ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లో మిగిలిన కులాల వాళ్ళందరితో మీటింగ్స్ పెట్టారు. సీమాంధ్రులు అంటే కమ్మవాళ్లే కాదు.. మిగతా కులాలు కూడా ఉన్నాయి కదా బుజ్జగించారు. వాళ్ళు చెప్పింది మిగిలిన కులాలు ఎందుకు ఫాలో అవ్వాలి అనే ప్రశ్న వాళ్ళలో లేవనెత్తారు.

తెలంగాణలో 26 ఆంధ్ర బీసీ కులాలకు రిజర్వేషన్ ఎత్తేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఏమయ్యాడు? ఈ కమ్మ వాళ్లంతా ఏమయ్యారు? వాళ్లు ఆంధ్ర బీసీల కోసం ఉద్యమాలు చేశారా? అలాంటప్పుడు వాళ్ల నాయకుడు కోసం మిగిలిన కులాలంతా ఇప్పుడు ఎందుకు త్యాగాలు చేయాలి అనే ప్రశ్న లేవనెత్తారు. దీంతో తెలంగాణలో సీమాంధ్రలు BRS కు వ్యతిరేకంగా కాంగ్రెస్ అనుకూలంగా ఓటెయ్యాలి అనే వాదన క్రమంగా బలహీనపడింది.