Telangana Assembly : మండలిలో గట్టెక్కడం ఎలా..? కాంగ్రెస్ ముందు పెద్ద టార్గెట్

తెలంగాణ శాసన మండలిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీల సంఖ్య నామ మాత్రమే. దీంతో కీలకమైన బిల్లుల ఆమోదం, ఇతర అంశాల్లో అట్నుంచి ప్రభుత్వానికి ఇబ్బంది తప్పదా.. చేయాలనుకున్న పనులను అనుకున్నట్టుగా చేయలేకపోతుందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 13, 2023 | 11:49 AMLast Updated on: Dec 13, 2023 | 11:49 AM

How To Join The Council Big Target Before Congress

తెలంగాణ శాసన మండలిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీల సంఖ్య నామ మాత్రమే. దీంతో కీలకమైన బిల్లుల ఆమోదం, ఇతర అంశాల్లో అట్నుంచి ప్రభుత్వానికి ఇబ్బంది తప్పదా.. చేయాలనుకున్న పనులను అనుకున్నట్టుగా చేయలేకపోతుందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. తెలంగాణ శాసన మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 40. ఇందులో అత్యధికంగా 28 మంది బీఆర్‌ఎస్‌ సభ్యులు ఉన్నారు. పెద్దల సభలో మెజార్టీ ప్రతిపక్షానిదే కావడంతో ముందు ముందు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది. అధికార కాంగ్రెస్‌ కావాలనుకున్నా.. ఇప్పటికిప్పుడు ఆ పార్టీకి మండలిలో పట్టు దొరికే అవకాశం లేదు. అందుకు కొంత సమయం పట్టవచ్చంటున్నారు పరిశీలకులు. ఇప్పుడున్న ఆరు మినహా 2025 దాకా తెలంగాణలో పెద్దగా ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ సీట్లు లేవు.

Telangana Assembly Speaker : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక.. గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నిక ఏకగ్రీవం తథ్యమేనా..?

దీంతో అక్కడ అధికార పార్టీ వ్యూహం ఎలా ఉండబోతోందోనన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. ముఖ్యమైన బిల్లుల ఆమోదం కోసం ప్రభుత్వం ఏం చేస్తుంది..? సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహాలు ఎలా ఉంటాయని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పొలిటికల్‌ పరిశీలకులు. అదే సమయంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి ఎవరైనా ఎమ్మెల్సీలు సిద్ధంగా ఉన్నారా? అన్న అనుమానాలు సైతం ఉన్నాయట. కౌన్సిల్‌లో ఇప్పడు మొత్తం ఆరు ఖాళీలు ఉన్నాయి. అందులో రెండు గవర్నర్‌ కోటాలోనివి. ఎమ్మెల్యేలు గా గెలిచిన నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. అందులో కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే కోటాలో ఎన్నికయ్యారు. ఇప్పుడున్న బలం ప్రకారం ఈ రెండు కాంగ్రెస్‌ ఖాతాలోకి వెళ్ళిపోతాయి. ఎమ్మెల్యేలైన మరో ఇద్దరు ఎమ్మెల్సీల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి, కసిరెడ్డి నారాయణ రెడ్డి స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆ ఇద్దరు కూడా రాజీనామా చేసినందున ఇప్పుడు ఆయా నియోజకవర్గాలకు ఎన్నిక జరగాల్సి ఉంది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ను మినహాయిస్తే.. కారు పార్టీలో నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళిన దామోదర్ రెడ్డి, MIM సభ్యులు ఇద్దరు, బీజేపీకి ఒక సభ్యుడు, ఇండిపెండెంట్ నర్సిరెడ్డి ఉన్నారు.

ఈ పరిస్థితుల్లో కత్తి మీద సాము లాంటి బిల్లుల ఆమోదాన్ని రేవంత్‌ సర్కార్‌ ఎలా డీల్‌ చేస్తుందన్నది ఆసక్తిగా మారింది. అలాగే ప్రస్తుతం ఉన్న ఆరు ఖాళీల్లో కొత్తగా ఎన్నికయ్యేది ఎవరన్న చర్చ కూడా జరుగుతోంది. ఎవరా ఆరుగురు అంటూ ఆరాలు తీస్తున్నాయి కాంగ్రెస్‌ వర్గాలు. అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచనలో సీఎం ఉన్నట్టు స్పష్టం అవుతోంది. మాజీ మంత్రి చిన్నారెడ్డి, అద్దంకి దయాకర్, NSUI వెంకట్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి ఎమ్మెల్సీ సీటు ఆశిస్తున్నారు. అంతే కాకుండా.. రేవంత్‌ సీరియస్‌ మద్దతుదారుడైన షబ్బీర్‌ అలీ, మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన మైనంపల్లి, నాంపల్లి నుంచి ఓడిన ఫిరోజ్‌ఖాన్‌, రేవంత్‌ ప్రధాన అనుచరుడు వేం నరేందర్‌రెడ్డి ఎమ్మెల్సీ స్థానాలను ఆశిస్తున్నారు. దీంతో పెద్దల సభలో కాంగ్రెస్‌ వ్యూహం ఎలా ఉంటుందని ఆసక్తిగా చూస్తున్నాయి రాజకీయ వర్గాలు.