EC notices KTR : ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. కేటీఆర్‌కు ఈసీ నోటీసులు..
హైదరాబాద్ ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ స్వయంగా కేటీఆర్‌కు నోటీసులు జారీ చేశారు. ప్రగతి భవన్‌లో కేటీఆర్ పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారంటూ తమకు వరుస ఫిర్యాదులు అందుతున్నాయి.. ఈ విషయంలో మంత్రి వివరణ ఇవ్వాల్సి ఉంటుందిన నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రగతి భవన్ సీఎం అధికారిక నివాసం. అంటే ప్రభుత్వం భవనం.
తెలంగాణలో ఎలక్షన్ హీట్ పీక్ స్టేజ్‌కి చేరిపోయింది. అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం ప్రారంభించాయి. తక్కువ టైంలో ఎక్కువ మంది ప్రజలకు రీచ్ అయ్యేందుకు ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు అన్వేశిస్తున్నారు నేతలు. రాత్రింబవళ్లు నిద్రాహారాలు కూడా మానేసి ప్రచారం చేస్తున్నారు కొందరు. ఇదే క్రమంలో కొందరు ఎలక్షన్ కోడ్‌ను కూడా ఉల్లంఘిస్తున్నారు. వాళ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ఎలక్షన్ కమిషన్. కోడ్ బ్రేక్ చేశారు అని తెలిస్తే చాలు నోటీసులు జారీ చేస్తోంది. అయితే ఏఎమ్మెల్యేనో మారుమూల ప్రాంతానికి చెందిన నేతకో నోటీసులు వెళ్తే ఎవరు పట్టించుకునేవాళ్లు కాదు. కానీ ఏకంగా మంత్రి కేటీఆర్‌కు కోడ్ ఉల్లఘించారు అంటూ నోటీసులు జారీ చేసింది ఎలక్షన్ కమిషన్.
హైదరాబాద్ ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ స్వయంగా కేటీఆర్‌కు నోటీసులు జారీ చేశారు. ప్రగతి భవన్‌లో కేటీఆర్ పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారంటూ తమకు వరుస ఫిర్యాదులు అందుతున్నాయి.. ఈ విషయంలో మంత్రి వివరణ ఇవ్వాల్సి ఉంటుందిన నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రగతి భవన్ సీఎం అధికారిక నివాసం. అంటే ప్రభుత్వం భవనం. ప్రభుత్వ భవనాల్లో, కార్యాలయాల్లో పార్టీ కార్యకలాపాలు నిర్వహించడం ఎలక్షన్ కోడ్‌ను ఉల్లంఘించడమే అవుతుంది. ఇదే పాయింట్‌ను నోటీసుల్లో పేర్కొన్నారు అధికారులు. సీఎం కేసీఆర్ కూడా ఫిర్యాదులు వచ్చాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో అదేం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ మీద ఇప్పటి వరకూ ఎవరూ ఫిర్యాదు చేయలేదని.. ఒకవేళ ఫిర్యాదు వస్తే ఖచ్చితంగా నోటీసులు జారీ చేస్తామంటూ చెప్పారు. ఎన్నికల కోడ్ ముగిసేవరకూ అధికార, ప్రతిపక్ష నేతలను సమానంగా చూస్తామంటూ వివరణ ఇచ్చారు. అధికారులు నోటీసులు ఇచ్చినా.. దీనికి కేటీఆర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.