RTC Bus, Zero Ticket : మహిళలకు ఇక జీరో టికెట్స్ .. బస్సు ఎక్కితే ఈ కార్డులు ఉండాల్సిందే..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ లో మహాలక్ష్మీ పథకం పేరుతో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రటించింది. అన్నట్లుగానే ఆ పథకం కూడా అమలు చేస్తుంది అధికార పార్టీ కాంగ్రస్ సర్కర్. కాగా గురువారం రాత్రి 12 గంటల నుంచి రాష్ట్ర అంతటా.. జీరో టికెటింగ్ విధానం అమ్లలోకి వచ్చింది. శుక్రవారం నుంచి జీరో టికెట్లును జారీ చేయాలని ఆర్టీసీ అధికారులకు ఎండీ వీసీ సజ్జనార్ ఆదేశాలు కూడా జారీ చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 15, 2023 | 11:03 AMLast Updated on: Dec 15, 2023 | 11:37 AM

Implementation Of Zero Ticket For Women From Today

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ లో మహాలక్ష్మీ పథకం పేరుతో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రటించింది. అన్నట్లుగానే ఆ పథకం కూడా అమలు చేస్తుంది అధికార పార్టీ కాంగ్రస్ సర్కర్. కాగా గురువారం రాత్రి 12 గంటల నుంచి రాష్ట్ర అంతటా.. జీరో టికెటింగ్ విధానం అమ్లలోకి వచ్చింది. శుక్రవారం నుంచి జీరో టికెట్లును జారీ చేయాలని ఆర్టీసీ అధికారులకు ఎండీ వీసీ సజ్జనార్ ఆదేశాలు కూడా జారీ చేశారు.

జీరో టికెటింగ్ విధానం ను గురువారం రాత్రి ప్రయోగాత్మకంగా కుషాయిగూడ, మిధాని సిటీ డిపోల్లో ప్రయోగాత్మకంగా పరిశీలించారు. అందులో జీరో టికెటింగ్ విధానం విజయవంతమవ్వడంతో అమల్లోకి తీసుకొచ్చారు. ఈ మేరకు టికెట్లు జారీ చేసే టిమ్ మెషిన్లలో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ఇన్‌స్టాల్‌ చేశారు. ఈ సమావేశంలో టీఎస్ఆర్టీసీ సీఓఓ డాక్టర్ రవీందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముని శేఖర్, సీటీఎం జీవన్ ప్రసాద్, సీఈఐటీ రాజశేఖర్, ఐటీ ఏటీఎం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతి తక్కువ సమయంలో జీరో టికెట్ సాఫ్ట్వేర్ న్ను అప్డేట్ చేసిన టీఎస్ఆర్టీసీ అధికారులను సజ్జనార్ అభినందించారు. ప్రయాణికులు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నారు, ప్రయాణించేది ఆర్డినరీ బస్సా లేక ఎక్స్‌ప్రెస్ బస్సా అనే వివరాలు ‘జీరో టికెట్’పై రికార్డ్ అవుతాయి. బుధవారం రాత్రి నుంచే వీటి పనితీరుని పరిశీలించారు.

ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరి

తెలంగాణలో ఎక్కడైనా తమ ప్రయాణాన్ని ప్రభుత్వ పథకం అయిన మహాలక్ష్మీ స్కీమ్ ను ఉపయోగించుకోవాలంటే.. ప్రతి మహిళ కూడా తప్పని సరి స్థాని గుర్తింపు కార్డు తమ వద్ద ఉంచుకోని కంటెక్టర్ కి చూపించి అనంతరం జీరో టికెట్ తీసుకోని ఉచిత ప్రయాణ సౌకర్యం పొందవచ్చు. గుర్తింపు కార్డులు.. రేషన్, ఆధార్, ఓటర్ ఐడీ వంటి స్థానిక అడ్రస్ తాము ఈ రాష్ట్ర వాళ్లు అన్నట్లుగా గుర్తింపు కార్డు చూపించాలి.

TSRTC సికింద్రాబాద్-పటాన్ ఇరుకైన మార్గంలో ఎలక్ట్రిక్ మెట్రో AC బస్సులను ప్రవేశపెట్టింది. ఈ బస్సులు నేటి నుంచి ప్రారంభమవుతాయి. ఈ మార్గంలో ప్రతి 24 నిమిషాలకు AC మెట్రో బస్సు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. రూట్ నంబర్ 219 ఉన్న ఈ బస్సులు ప్యారడైజ్, బోయిన్ పల్లి, బాలానగర్, కూకట్ పల్లి మీదుగా పటాన్ చెరు చేరుకుంటాయి. తిరిగి అదే మార్గంలో సికింద్రాబాద్కు చేరుకుంటారు. ఈ మార్గంలో ప్రయాణించే వారందరూ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని TSRTC ఒక ప్రకటనలో తెలిపింది.

మహిళా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రతి ఒక్కరూ సంస్థకు సహకరించాలని అభ్యర్థించారు.