Telangana Elections : యువకెరటాల ముందు.. మహామహులే ఓడారు !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. అధికారానికి అవసరమైన స్థానాలను కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున యువ నేతలు జయకేతనం ఎగుర వేశారు. రాజకీయాల్లో మహామహులైన వారిని మట్టి కరిపించారు. రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధం లేకపోయినా మొదటి ఎన్నికల్లోనే సత్తా చాటారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 4, 2023 | 02:26 PMLast Updated on: Dec 04, 2023 | 2:26 PM

In The Telangana Assembly Elections Mahamahule Lost In Front Of Youths

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. అధికారానికి అవసరమైన స్థానాలను కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున యువ నేతలు జయకేతనం ఎగుర వేశారు. రాజకీయాల్లో మహామహులైన వారిని మట్టి కరిపించారు. రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధం లేకపోయినా మొదటి ఎన్నికల్లోనే సత్తా చాటారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. కొందరు సీనియర్ నేతలకు షాకిచ్చాయి. రాజకీయాల్లో ఎలాంటి అనుభవం లేకపోయినా.. పోటీ చేసిన మొదటిసారే విజయం సాధించారు. అసెంబ్లీలో అడుగు పెట్టి అధ్యక్ష అంటూ.. ప్రజల తరపున తమ వాణి వినిపించనున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా 26 ఏళ్ల మామిడాల యశస్వినిరెడ్డి అనూహ్యంగా బరిలో నిలిచి గెలుపొందారు. సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్‌ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును ఆమె ఓడించారు. 2018లో బీటెక్‌ పూర్తి చేసిన ఆమె.. పెళ్ళి తర్వాత అమెరికాకు వెళ్లిపోయారు. అక్కడ కొంతకాలం స్థిరాస్తి వ్యాపార సంస్థలో పనిచేశారు. నిజానికి పాలకుర్తి అభ్యర్థిగా కాంగ్రెస్‌ మొదట వేరే అభ్యర్థిని ప్రకటించింది. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు విదేశాల నుంచి వచ్చిన హనుమాండ్ల ఝాన్సీరెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేసింది. అయితే భారత పౌరసత్వం కోసం ఆమె చేసుకున్న దరఖాస్తు ముందుకు కదలకపోవడంతో ఆమె పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో ఆమె తన స్థానంలో కోడలు యశస్వినికి అవకాశమివ్వాలని కోరడంతో కాంగ్రెస్‌ అధిష్ఠానం అంగీకరించి టికెట్‌ ఇచ్చింది. తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ లీడర్ గా ఉన్న దయాకర్ రావు ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు. తిరుగులేని నేతగా ఉన్న ఎర్రబెల్లిని 26యేళ్ళ యశస్విని రెడ్డి ఓడించారు.

KCR : ప్రగతి భవన్‌ నుంచి కేసీఆర్ వెళ్లిపోయే ముందు.. ఏం జరిగిందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

మెదక్‌ స్థానం నుంచి 26 ఏళ్ల మైనంపల్లి రోహిత్‌ విజయం సాధించారు. బీఆర్ఎస్‌ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డిపై గెలిచారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావు కుమారుడైన రోహిత్‌ మేడ్చల్‌లోని మెడిసిటీ వైద్య కాలేజీ నుంచి MBBS పూర్తి చేశారు. రెండు గోల్డ్‌ మెడల్స్‌ సాధించారు. హైదరాబాద్‌లో డాక్టర్ గా ఉంటూనే మైనంపల్లి సోషల్‌ సర్వీస్‌ ఆర్గనైజేషన్‌ ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు. మెదక్‌ నుంచి రోహిత్‌కు బీఆర్ఎస్ టికెట్‌ ఇవ్వాలని మైనంపల్లి హన్మంత్‌రావు తీవ్రంగా ప్రయత్నించారు. బీఆర్ఎస్‌ అందుకు నిరాకరించింది. దాంతో తండ్రీ కొడుకులిద్దరూ కాంగ్రెస్‌లో చేరారు. కోరుకున్నట్టే మైనంపల్లి హన్మంత్‌రావు మల్కాజిగిరి నుంచి.. రోహిత్‌ మెదక్‌ నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేశారు. పద్మాదేవేందర్‌రెడ్డిపై రోహిత్‌ 9వేలకుపైగా మెజారిటీతో విజయం సాధించారు. మరోవైపు నారాయణపేట నియోజకవర్గం నుంచి 30 ఏళ్ల చిట్టెం పర్ణికారెడ్డి గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాజేందర్‌రెడ్డిపై 7 వేల 950 ఓట్ల ఆధిక్యంతో ఆమె విజయం సాధించారు. పర్ణిక ప్రస్తుతం భాస్కర వైద్య కళాశాలలో పీజీ చేస్తున్నారు. ఈమె తాత చిట్టెం నర్సిరెడ్డి మక్తల్‌ ఎమ్మెల్యేగా, తండ్రి చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డి పీసీసీ సభ్యుడిగా పనిచేశారు. 2005లో మావోయిస్టుల కాల్పుల్లో నర్సిరెడ్డితో పాటు వెంకటేశ్వర్‌రెడ్డి చనిపోయారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం ఈ ఎన్నికల్లో మహిళా కోటాలో పర్ణికారెడ్డికి పోటీ చేసే అవకాశం ఇచ్చింది. పర్ణిక తల్లి లక్ష్మి.. పౌరసరఫరాల శాఖలో అదనపు కార్యదర్శి పని చేస్తున్నారు. 2014, 2018 ఎన్నికల్లో గెలుపొందిన రాజేందర్‌ రెడ్డిపై పర్ణికారెడ్డిపై విజయం సాధించారు.

కంటోన్‌మెంట్‌ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్‌ తరపున పోటీ చేసిన 36 ఏళ్ల లాస్య నందిత కూడా మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ కార్పొరేటర్‌గా గెలిచారు. 2021లో అదే డివిజన్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తండ్రి సాయన్న ఆకస్మిక మరణంతో.. గులాబీ బాస్‌ కేసీఆర్‌ లాస్య నందితకు సీటు కేటాయించారు. శాసనసభకు పోటీ చేసిన ఆమె మొదటిసారి ఎన్నికల్లోనే గెలుపొందారు. లాస్య నందిత…కాంగ్రెస్‌ అభ్యర్థి, గద్దర్‌ కూతురు వెన్నెలపై విజయం సాధించారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నలుగరు యువకెరటాలు.. ఈ ఎన్నికల్లో మహామహులనే ఓడగొట్టారు.