Telangana Elections, Independents : రాజకీయా పార్టీలను టెన్షన్ పెడుతున్న ఇండిపెండెంట్ క్యాండిడేట్లు..
తెలంగాణలో ఎన్నికల పోరు దాదాపు ఆఖరి ఘట్టానికి చేరుకుంది. మరో వారం రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు కూడా వస్తాయి. దాదాపు 10 రోజుల్లో.. రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది అనే విసయం తెలిసిపోతుంది.
తెలంగాణలో ఎన్నికల పోరు దాదాపు ఆఖరి ఘట్టానికి చేరుకుంది. మరో వారం రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు కూడా వస్తాయి. దాదాపు 10 రోజుల్లో.. రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది అనే విసయం తెలిసిపోతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న అభ్యర్థులు రాజకీయ పార్టీలను టెన్షన్ పెడుతున్నారు. ఈ సారి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల్లో.. 991 మంది అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్నారు. వీళ్ల వల్ల భారీగా ఓట్ బ్యాంక్ చీలిపోయే ప్రమాదముంది. 2014లో 668 మంది అభ్యర్థులు ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. ఇక 2018లో 675 మంది పోటీ చేశారు. రెండు ఎన్నికల్లో కలిపి రాష్ట్రవ్యాప్తంగా ఇండిపెండెంట్లకు 16 లక్షల 4 వేల ఓట్లు పోలయ్యాయి. అంటే ఈ కోట్లన్నీ చీలిపోయినట్టే. ఇప్పుడు ఏకంగా 991 మంది రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేస్తున్నారు. అంటే రెండు సంవత్సరాలతో కంపేర్ చేస్తే.. ఈసారి భారీగా ఓట్ బ్యాంక్ చీలిపోయే ప్రమాదముంది. దీనికి తోడు ఈ సంవత్సరం అన్ని పార్టీలు దాదాపు బలంగానే ఉన్నాయి.
BRS leaders : చివరి నిమిషంలో జంపింగ్స్.. బీఆర్ఎస్ నేతలు సేఫ్ జోన్ చూసుకుంటున్నారా..?
గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా సిచ్యువేషన్ ఉంది. కానీ అన్ని పార్టీలు కూటమిగా ఏర్పడి తమ ఓటమిని తామే డిసైడ్ చేసుకున్నాయి. కానీ ఈసారి కాంగ్రెస్ తెలంగాణలో చాలా బలంగా ఉంది. బీజేపీ కూడా కొత్త హామీలు, మేనిఫేస్టోలతో దూసుకుపోతోంది. ఇక బీఎస్పీ, బీజేపీ కూటమితో జనసేన పార్టీలు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఇవి కాకుండా పెద్దగా ఆదరణ పొందని పార్టీల అభ్యర్థులు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వీళ్లందరితో పాటు ఇప్పుడు ఇండిపెండెంట్లు కూడా భారీగా ఓట్ బ్యాంక్ చీల్చబోతున్నారు. దీంతో అధికార బీఆర్‌ఎస్‌తో పాటు.. దాదాపు అన్ని పార్టీల్లో ఇండిపెండెంట్ల టెన్షన్ కనిపిస్తోంది. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ క్యాండెట్లచేత నామినేషన్ విత్ డ్రా చేయించారు నేతలు. కానీ కొందరు మాత్రం ఎవరి మాటా వినకుండా ఎన్నికలను ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్లే రాజకీయ పార్టీలను టెన్షన్ పెడుతున్నారు. చూడాలి మరి ఈ సంవత్సరం ఇండిపెండెంట్లు ఎన్ని లక్షల ఓట్లు చీల్చుతారో.